వన్డే వరల్డ్ కప్ 2023( ODI World Cup 2023 ) టోర్నీలో పసికూన జట్లు విజయాలు సాధిస్తుంటే.గతంలో టైటిల్ గెలిచి ఛాంపియన్ గా నిలిచిన జట్లు ఓటములను చవిచూస్తున్నాయి.
ఈ టోర్నీలో పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు పసికూన జట్ల చేతుల్లో ఘోరంగా ఓటమిని చవిచూస్తున్నాయి.ఈ టోర్నీలో పాకిస్తాన్ జట్టు( Pakistan ) పరిస్థితి చాలా దారుణంగా మారింది.
ఒక మ్యాచ్లో బ్యాటింగ్ వైఫల్యం.మరో మ్యాచ్లో బౌలింగ్ వైఫల్యం.
ఈ రెండు బాగుంటే ఫీల్డింగ్ లో క్యాచ్లు జారవించడం.ఇలా ఏదో ఒక వైఫల్యం పాకిస్తాన్ జట్టును వెంటాడి గెలుపును దూరం చేస్తోంది.

మరి పాకిస్తాన్ జట్టు సెమీఫైనల్ ( Semifinal ) చేరే అవకాశాలు సజీవంగానే ఉన్నాయా.జట్టు సెమీఫైనల్ చేరాలంటే ఏం జరగాలో చూద్దాం.పాకిస్తాన్ జట్టు ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్లలో కేవలం రెండు మ్యాచ్లలోనే విజయం సాధించింది.ఈ టోర్నీలో పాకిస్తాన్ జట్టు ఇంకా నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది.
ఈ నాలుగు మ్యాచ్లలో పాకిస్తాన్ జట్టు విజయం సాధిస్తే.మొత్తం ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో ఉంటుంది.
అయినా కూడా ఈ జట్టు సెమిస్ చేరుతుందా లేదా అనేది మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంది.

ఈ టోర్నీలో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లను పరిశీలిస్తే.భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు సెమీస్ చేరే అవకాశం ఉంది.కాబట్టి సెమీస్ రేసులో ఉన్న సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా జట్లలో ఏదో ఒక జట్టు ఫలితాలు తారుమారు అవడం.
పాకిస్తాన్ తదుపరి మ్యాచ్లలో అధిక రన్ రేట్ తో( Run Rate ) గెలవడం జరిగితే.పాకిస్తాన్ సెమిస్ చేరుతుంది.అయితే ఇలా జరగడం ఒకరకంగా చాలా కష్టమే.ఇలాంటి పరిస్థితులలో పాకిస్తాన్ సెమీస్ చేరేది లేనిది కాలమే నిర్ణయించాలి.







