తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉన్న విషయం మనకు తెలిసిందే.అక్కినేని నాగేశ్వరరావు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మచ్చ సక్సెస్ అందుకున్నటువంటి నాగేశ్వరరావు వారసురుగా ఇండస్ట్రీలోకి నాగార్జున (Nagarjuna) అడుగు పెట్టారు.ఈయన కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలిగారు.
నాగార్జున రెండోసారి నటి అమల(Amala) ను వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఈ దంపతులకు అఖిల్ (Akhil) సంతానం.
ప్రస్తుతం అఖిల్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు అయితే హీరోగా ఈయన మాత్రం ఇప్పటికే ఐదు సినిమాలు చేసిన ఏ ఒక్క సినిమా కూడా సక్సెస్ కాలేదని చెప్పాలి.ఇలా సక్సెస్ లేక ఇండస్ట్రీలో ఎంతో సతమతం అవుతున్నారు.
ఇకపోతే అఖిల్ ఐదు నెలల వయసులోనే సిసింద్రీ( Sisindri )సినిమాలో బాలా నటుడుగా అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే.ఈ సినిమాలో నాగార్జున ఆమని హీరో హీరోయిన్లుగా నటించారు అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.

అంత చిన్న పిల్లాడిని సినిమా ఇండస్ట్రీలోకి తీసుకురావాలని ఆలోచన ఎలా వచ్చింది? అసలు అఖిల్ సినిమా షూటింగ్లో ఎలా పాల్గొన్నారు అనే విషయాల గురించి ఒక ఇంటర్వ్యూ సందర్భంగా నాగార్జున అమల పాల్గొని ఈ విషయాల గురించి వెల్లడించారు.అసలు అఖిల్ సిసింద్రీ సినిమాలో నటించడం గురించి మీ దగ్గర ప్రస్తావించగా మీ రియాక్షన్ ఏంటి అంటూ అమలని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు అమల సమాధానం చెబుతూ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు( Director Nageswara Rao ) ఇంటికి వచ్చి సిసింద్రీ సినిమా చేస్తున్నాము మీ అబ్బాయి డేట్స్ కావాలి అని నన్ను అడిగారు నాకు కోపం వచ్చే ఆయన మొహం మీద తలుపులు వేశాను.

ఐదు నెలల పిల్లాడు సినిమాలలో నటించడం ఏంటి? నేను మరీ తనకు డేట్స్ ఇవ్వడం ఏంటి అంటూ తనకు చాలా కోపం వచ్చిందని అమల తెలిపింది అయితే ఆయన మొహంపై నేను డోర్ వేయడంతో ఆయన వెళ్లి నాగార్జునని కలిసారని అమలా తెలిపారు.ఇక నాగార్జునని కలిసిన తర్వాత స్టోరీ మొత్తం చెప్పి కథ బాగుంది అనిపించింది.ఇక అమల దగ్గరకు వెళ్లి ఈ విషయం గురించి నేను మాట్లాడాను.
అమల అఖిల్ సిసింద్రీ సినిమాలో నటించడానికి ఒప్పుకుంది అంటే కేవలం బ్లూ క్రాస్ వల్ల మాత్రమేనని నాగార్జున తెలిపారు.

అప్పుడే అమల బ్లూ క్రాస్( Blue Cross ) స్థాపించింది దానికోసం ఫండ్స్ కావాలి.నేను ఒక సినిమా చేసి ఆ డబ్బులు తనకు ఇవ్వచ్చు కానీ అఖిల్ సినిమా చేసి ఆ సినిమాకు వచ్చిన డబ్బు బ్లూ క్రాస్ సమస్త కు పెడితే పేరు ఉండిపోతుంది కదా అంటూ తనకు ఈ విషయం గురించి చెప్పాను బ్లూ క్రాస్ పేరు చెప్పగానే సినిమాకు వచ్చిన డబ్బు మొత్తం ఇస్తాను అని చెప్పగానే వెంటనే ఒప్పుకుంది అంటూ నాగార్జున ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
అలా సిసింద్రీ సినిమా షూటింగ్ సమయంలో తనతో పాటు రోజు అమలా కూడా షూటింగ్ లొకేషన్లోకి వచ్చి మేనేజ్ చేసేది అని ఈ సినిమా షూటింగ్ కారణంగా నాకు అఖిల్ మద్య మంచి బాండింగ్ ఏర్పడిందంటూ నాగార్జున తెలియజేశారు.
ఇక ఈ సినిమాకు నిర్మాత నాగార్జున కావటం విశేషం.ఇలా ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అయిన తర్వాత సినిమాకు వచ్చిన డబ్బు మొత్తం నాగార్జున అమల బ్లూ క్రాస్ సంస్థకు ఇచ్చినట్టు తెలియజేశారు.







