పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan kalyan ) ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న చిత్రం ‘ఓజీ’.ఈ సినిమా కోసం కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, నార్మల్ ఆడియన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు.
పవన్ కళ్యాణ్ ని అభిమానులు ఇన్ని రోజులు ఎలాంటి పవర్ ఫుల్ రోల్ లో అయితే చూడాలని కోరుకున్నారో, అలాంటి పవర్ ఫుల్ రోల్ లో చూపిస్తున్నందుకు డైరెక్టర్ సుజిత్( Sujeeth ) ని ప్రశంసల వర్షం తో ముంచి ఎత్తారు.పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు విడుదల చేసిన ఓజీ మొదటి గ్లిమ్స్ వీడియో కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.
ఊహించిన దానికంటే వంద రెట్లు అద్భుతమైన క్వాలిటీ మేకింగ్, షాట్ మేకింగ్ తో డైరెక్టర్ సుజిత్ అదరగొట్టాడని, పవన్ కళ్యాణ్ ని ఇలా చేసి ఎన్ని రోజులు అయ్యిందో అంటూ అభిమానులు ఎంతగానో మురిసిపోయారు.

ఇకపోతే ఈరోజు దసరా కానుకగా విడుదల చేసిన ఒక పోస్టర్ కి ఫ్యాన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.వేటాడే పులి లాగ పవన్ కళ్యాణ్ చూస్తున్న ఫోటో ని విడుదల చేస్తూ ‘అతను కళ్ళు.మారణాయుధాలకంటే పవర్ ఫుల్’ అనే ట్యాగ్ ని ఉపయోగించి పోస్ట్ చేసింది మూవీ టీం.ఈ పోస్టర్ కి ఫ్యాన్స్ మెంటలెక్కిపోయారు.ఈ పోస్టర్ విడుదలైన రెండు గంటల్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరో సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పోస్టర్( Ustaad Bhagat Singh ) కూడా విడుదలైంది.
ఈ చిత్రం మీద కూడా అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు.ఎందుకంటే ‘గబ్బర్ సింగ్’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న చిత్రమిది.
ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో మరియు పోస్టర్స్ కి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.కానీ నేడు విడుదల చేసిన పోస్టర్ కి మాత్రం నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది.

స్టిల్ బాగున్నప్పటికీ నాసి రకం ఎడిటింగ్ తో చెత్తగా క్వాలిటీ తో విడుదల చేసారని, ఓజీ కి పోటీగా దింపాలని ఉద్దేశ్యంతో కాకుండా కాస్త శ్రద్ద పెట్టి కంటెంట్ ని విడుదల చెయ్యండి అంటూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మేకర్స్ పై విరుచుకుపడ్డారు అభిమానులు.ఈ రెండు పోస్టర్స్ లో ఓజీ కే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది.ఓజీ చిత్రం కేవలం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పోస్టర్ ని మాత్రమే కాదు, ఈరోజు విడుదలైన దేవర, గుంటూరు కారం, సలార్ ఇలా అన్నీ దసరా పోస్టర్స్ ని డామినేట్ చేసి సినిమా పై మరింత అంచనాలు పెంచేలా చేసింది.







