ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి.తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్</em( Chandrababu arrest ) అయి దాదాపు 40 రోజులకు పైగా కావస్తోంది.
ఈ క్రమంలో బెయిల్ తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ లీగల్ టీం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది.అయినా కానీ బెయిల్ రాకపోవడంతో వైసీపీ వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబుని ఇబ్బందులు పాలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇదే కేసులో అరెస్ట్ అయిన వాళ్లు ప్రజెంట్ బెయిల్ మీద బయట తిరుగుతున్నారని తెలియజేస్తున్నారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబుని జైల్లో బంధించారని వ్యాఖ్యలు చేస్తున్నారు.
మరోపక్క వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో నేడు రాజమండ్రి మంజీరా హోటల్ లో టీడీపీ జనసేన పార్టీల సమన్వయ కమిటీ భేటీ నిర్వహించడం జరిగింది.
ఈ భేటీలో ఇరు పార్టీలకు చెందిన కమిటీ సభ్యులతో పాటు పవన్ కళ్యాణ్, నారా లోకేష్( Pawan Kalyan Nara Lokesh ) హాజరు కావడం జరిగింది.మొత్తం ఆరు అంశాలపై చర్చలు జరిపారు.
అంతేకాకుండా ఎన్నికల మేనిఫెస్టో.ఎన్నికల సమయంలో రెండు పార్టీల కార్యచరణ వంటి అంశాలపై చర్చించడం జరిగింది.అయితే రాజమండ్రిలో జరిగిన ఈ సమన్వయ కమిటీ భేటీ పై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు ( Ambati Rambabu )ట్విట్టర్ లో సెటైర్లు వేశారు.“రాజమండ్రిలో పాత కలయికకు కొత్త రూపం! 0+0=0!” అనీ ట్విట్ చేశారు.