కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విజయ్ లియో( Leo ) సినిమాతో బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ ను అందుకున్నారు.ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు రికార్డ్ స్థాయిలో ఉన్నా మిక్స్డ్ టాక్ రావడంతో సెకండ్ డే నుంచి కలెక్షన్లు తగ్గాయి.
అయితే విజయ్ హీరోగా నటించిన సినిమాలలో రీమేక్ సినిమాలు ఎక్కువగా ఉన్నాయి.ఈ సినిమాలలో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం గమనార్హం.

తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన పెళ్లి సందడి సినిమాను విజయ్ 1996లో నినైతేన్ వందాయ్( Ninaithen Vandhai ) పేరుతో రీమేక్ చేసి సక్సెస్ సాధించారు.పవిత్ర బంధం సినిమాను ప్రియ మానవాలే పేరుతో విజయ్ రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు.పవన్ బద్రి సినిమాను విజయ్ అదే టైటిల్ తో తమిళంలో రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నారు.చిరునవ్వుతో సినిమాను యూత్ పేరుతో రీమేక్ చేసి ఈ సినిమాతో కూడా బాక్సాఫీస్ ను విజయ్ షేక్ చేశారు.

ఆ తర్వాత విజయ్ నువ్వు నాకు నచ్చావ్ సినిమాను వసీగర పేరుతో రీమేక్ చేసి ప్రేక్షకులను మెప్పించారు.నీతో సినిమాను విజయ్ సాచీన్ అనే పేరుతో రీమేక్ చేశారు.టాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఒక్కడు సినిమాను విజయ్ గిల్లీ పేరుతో విజయ్ రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నారు.గిల్లీ సినిమా( Ghilli )లో త్రిష హీరోయిన్ గా నటించారు.
అతనొక్కడే సినిమాను విజయ్ ఆతి పేరుతో రీమేక్ చేయడం గమనార్హం.పోకిరి సినిమాను విజయ్ పోక్కిరి పేరుతో తమిళంలో రీమేక్ చేశారు.
విజయ్ స్టార్ హీరోగా సక్సెస్ సాధించడంలో తెలుగు సినిమాల పాత్ర ఎంతో ఉంది.విజయ్ తాజాగా నటించిన లియో ఒక హాలీవుడ్ మూవీకి రీమేక్ అనే సంగతి తెలిసిందే.
రాబోయే రోజుల్లో విజయ్ కు భారీ బ్లాక్ బస్టర్ హిట్లు దక్కాలని ఆయన అభిమానులు భావిస్తున్నారు.







