తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ టిడిపి( Telangana TDP ) ఎన్నో ఆశలు పెట్టుకుంది.అయితే టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు( Chandrababu Naidu ) స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండడంతో ఈ విషయంలో ఏ క్లారిటీ రావడం లేదు .
ఇప్పటికే ఆశావాహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ పూర్తి చేశారు. ఇప్పటి వరకు 190 దరఖాస్తులు అందాయి.
అయితే టిడిపి బలంగా ఉన్న 70 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీకి దించాలని టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ నిర్ణయించుకున్నారు.అయితే ఈ విషయంలో అధినేత చంద్రబాబు నిర్ణయం ఏమిటో తెలుసుకుని దానికి అనుగుణంగా ముందడుగు వేయాలని జ్ఞానేశ్వర్ భావిస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను బరిలోకి దించితే ఎలా ఉంటుందనే విషయం పైన పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది.ఇప్పటికే ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరణ పూర్తి కావడంతో, వాళ్లలో బలమైన నేతలను గుర్తించారు.ఈ మేరకు ఒక జాబితాను సిద్ధం చేసుకుని చంద్రబాబు నాయుడుతో ములకత్ అవ్వాలని కాసాని జ్ఞానేశ్వర్( Kasani Gnaneshwar ) నిర్ణయించుకున్నారు.ఈ మేరకు బుధవారం రాజమహేంద్రవరం( Rajamahendravaram ) వెళ్లి చంద్రబాబుతో భేటీ అవ్వాలని నిర్ణయించుకున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు,( Telangana Assembly Elections ) అభ్యర్థుల ఎంపిక, ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి అనే విషయంపై చంద్రబాబు వద్ద క్లారిటీ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు .ఏపీలో, టీడీపీ జనసేన కలిసి పోటీ చేయబోతున్న నేపథ్యంలో, తెలంగాణలో పొత్తుల విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయం పైన చంద్రబాబు వద్ద క్లారిటీ తీసుకోనున్నట్టు సమాచారం.

ఇప్పటికే బీజేపీ , జనసేన తెలంగాణలో పొత్తు పెట్టుకుని నేపథ్యంలో, టిడిపి ఆ పార్టీతో జత కలిస్తే పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు కోరాలి ? లేక ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయాలా అనే విషయం పైన చర్చించనున్నారట.ప్రస్తుతం చంద్రబాబు అరెస్టు వ్యవహారం తరువాత ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణపై లోకేష్( Nara Lokesh ) దృష్టి సారించడం లేదు. చంద్రబాబు వియ్యంకుడు , హిందూపురం టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) తెలంగాణ టిడిపి బాధ్యతలు చూస్తానని ప్రకటించినా, ఆయన కూడా అంత ఆసక్తి చూపించడం లేదు.దీంతో తెలుగుదేశం పార్టీ పోటీ చేసే విషయంలో తర్జన భర్జన జరుగుతోంది బుధవారం చంద్రబాబుతో కాసాని జ్ఞానేశ్వర్ భేటీ అయిన తర్వాత గాని తెలంగాణలో టిడిపి పోటీ చేసే విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.







