చాట్‌జీపీటీ హెల్ప్‌తో రూ.15,000 పెట్టుబడి పెట్టి రూ.1.2 కోట్లు సంపాదించారు...!

వ్యాపారాన్ని ప్రారంభించడానికి చాలా డబ్బు, అద్భుతమైన ఆలోచన ఉండటమే కాక చాలా కష్టపడి పనిచేయాలని చాలా మంది అనుకుంటారు.కానీ అప్పుడు కూడా, వ్యాపారం విజయవంతమవుతుందని లేదా పోటీని తట్టుకుంటుందనే గ్యారెంటీ లేదు.

 These Two Friends Used Chatgpt To Build Ai Startup With Just Rs 15000 Details, D-TeluguStop.com

బిజినెస్ లో ఇంత రిస్క్ ఉందని చాలామంది భావిస్తూ వెనక్కి తగ్గుతుంటారు.కానీ వ్యాపారంలో అసలు డబ్బులు పెద్దగా పెట్టక్కర్లేదని, రిస్కు కూడా జీరో అని తాజాగా సాల్ ఐయెల్లో,( Sal Aiello ) మోనికా పవర్స్( Monica Powers ) అనే ఇద్దరు వ్యక్తులు నిరూపించారు.వారు కేవలం 185 డాలర్ల (సుమారు రూ.15,400) విలువైన ప్రొడక్ట్‌ను సృష్టించడానికి జనరేటివ్ AIని ఉపయోగించారు.

వారి ప్రొడక్ట్ డైమ్ఏడజన్ (DimeADozen) అనే ఒక AI రీసెర్చ్ టూల్.ఇది వ్యక్తులు వారి వ్యాపార ఆలోచనలను త్వరగా, సులభంగా పరీక్షించడంలో సహాయపడుతుంది.వారు స్మార్ట్ ప్రశ్నలను అడగగలిగే చాట్‌బాట్ అయిన చాట్‌జీపీటీ( ChatGPT ) సహాయంతో దీన్ని రూపొందించారు.ఆపై సాఫ్ట్‌వేర్, ప్రొడక్ట్ డిజైన్‌లో నైపుణ్యం కలిగిన భార్యాభర్తల బృందం అయిన ఫెలిప్ అరోసెమెనా, డేనియల్ డి కార్నెయిల్‌లకు వారు తమ స్టార్టప్‌ను ఏకంగా రూ.1.2 కోట్లకు విక్రయించారు.ఈ భార్యాభర్తలు డైమ్ఏడజన్ సామర్థ్యాన్ని చూసి దానిని సొంతం చేసుకోవాలనుకున్నారు.

Telugu Ideas, Chatgpt, Dimeadozen, Generative Ai, Research, Monica, Sal Aiello,

డైమ్ఏడజన్ ఎలా పని చేస్తుంది? ఈ టూల్ మీ వ్యాపార పేరు, వివరణను రాయమని అడుగుతుంది.అప్పుడు అది మిమ్మల్ని మరో రెండు ప్రశ్నలు అడుగుతుంది.ఆ తర్వాత, ఇది మీ కోసం ఒక వివరణాత్మక నివేదికను రూపొందిస్తుంది.

నివేదికలో వ్యాపారం( Business ) గురించి, మార్కెట్ పరిశోధన అవగాహనలు, లాంచ్, స్కేల్ వ్యూహాలు, మూలధనాన్ని పెంచే చిట్కాలు ఉన్నాయి.

Telugu Ideas, Chatgpt, Dimeadozen, Generative Ai, Research, Monica, Sal Aiello,

డైమ్ఏడజన్ అనేది చాట్‌జీపీటీకి స్మార్ట్ ప్రశ్నలు( Smart Questions ) అడగడానికి AIని ఉపయోగించడం ద్వారా పుట్టిన కంపెనీ.వారు ప్రశ్నించే నైపుణ్యాలను మెరుగుపరిచి చాలా మందికి, ముఖ్యంగా వ్యవస్థాపకులకు సహాయం చేయగలరని గ్రహించారు.కాబట్టి వారు వ్యాపార ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఫారమ్‌ను పూరించడానికి అనుమతించే ప్రత్యేక టూల్ తయారు చేశారు.

ఫారమ్ డేటాను సమగ్ర నివేదికలుగా మార్చడానికి డైమ్ఏడజన్ టూల్ అడ్వాన్స్డ్‌ అల్గారిథమ్‌లను ఉపయోగిస్తుంది.పెట్టుబడిదారులు, కస్టమర్లు, పోటీదారుల వంటి విషయాలను నివేదికలు విశ్లేషిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube