అఫీషియల్ : ‘Nani31’లో ఎస్ జే సూర్య.. పోస్టర్ తో రివీల్!

న్యాచురల్ స్టార్ నాని( Nani ) మొదటి నుండి ఏడాదికి మూడు సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకు పోతున్నాడు.అయితే ఈ సంఖ్య ఈ మధ్య బాగా తగ్గించాడు.

 Sj Surya To Play Key Role In Nani 31 Movie-TeluguStop.com

దసరా సినిమా( Dasara Movie ) తర్వాత ఆచి తూచి కథలను ఎంచుకుంటూ తన స్థాయి పడిపోకుండా చూసుకుంటున్నాడు.నాని కెరీర్ లోనే ‘దసరా’ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.

ఈ సినిమాతో అప్పటి వరకు క్లాస్ హీరోగా అలరించిన నాని ఈ సినిమాతో మాస్ హీరోగా అవతరించాడు.ఈ సినిమా భారీ విజయం తర్వాత ఇప్పుడు తన కథల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.ప్రజెంట్ ‘హాయ్ నాన్న’ ( hi nanna )సినిమాను రిలీజ్ కు రెడీగా ఉంచి మరో సినిమాను అనౌన్స్ చేసాడు.ఈ సినిమాను డైరెక్టర్ శౌర్యన్ తెరకెక్కిస్తుండగా మృణాల్ ఠాకూర్( Mrinal Thakur ) హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ ఏడాది డిసెంబర్ 7న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాతో రాబోతున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నట్టు ప్రకటన వచ్చింది.

ఇప్పటికే హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్( Priyanka Arul Mohan ) ను హీరోయిన్ గా కన్ఫర్మ్ చేశారు.

కాగా ఈ సినిమా నుండి ఈ రోజు మరో అనౌన్స్ మెంట్ వచ్చింది.అనౌన్స్ మెంట్ తోనే ఆసక్తి పెంచేసిన ఈ సినిమాలో ఎస్ జే సూర్య కీలక పాత్రలో నటించనున్నారు.ఈ విషయాన్నీ తాజాగా కొద్దిసేపటి క్రితం పోస్టర్ ద్వారా తెలిపారు.

ఇక డివివి ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 24న విజయదశమి రోజున లాంచ్ చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube