'టైగర్ నాగేశ్వరరావు' అరగంట కోత.. ఇప్పుడైనా క్లిక్ అవుతుందా?

మాస్ మహారాజ రవితేజ ( Ravi Teja ) మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.తాజాగా ఈయన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ చేసాడు.

 Tiger Nageswara Rao Trimmed By 20 Minutes, Tiger Nageswara Rao, Maharaja Ravi Te-TeluguStop.com

రవితేజ చేసిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”టైగర్ నాగేశ్వరరావు” ( Tiger Nageswara Rao )నూతన డైరెక్టర్ వంశీ( Director Vamsi ) దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాతో రవితేజ మొదటిసారి పాన్ ఇండియన్ సినిమా చేసాడు.

మరి ఈయన ఎలాంటి హిట్ అందుకుంటాడా అని ఫ్యాన్స్ కూడా ఎదురు చూడగా నిన్న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

అయితే ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ నుండి ఒక కంప్లైంట్ వస్తుంది.ఈ సినిమా నిడివి చాలా పెద్దగా ఉందని అందరు చెబుతున్నారు.ఇదే సినిమా ఫలితాన్ని దెబ్బ తీసిందని వాదిస్తున్నారు.

Telugu Ravi Teja, Tigernageswara-Movie

అయితే ఇది వంశీ డ్రీమ్ ప్రాజెక్ట్( Vamsi Dream Project ) కావడంతో ఎక్కడ రాజీపడకుండా వెండితెరపై ఆవిష్కరించడంలో వంశీ సక్సెస్ అయ్యాడు.కానీ దాదాపు 3 గంటల నిడివితో రావడమే కొద్దిగా సమస్య అయ్యింది.కొద్దీ సీన్స్ లాగ్ చేసారు అనే వాదన ఉన్న చాలా వరకు వంశీ బాగా తెరకెక్కించారు.

అయితే నిడివి తగ్గిస్తే బెటర్ రిస్క్ అని హెచ్చరించిన ఈయన తగ్గలేదట.కానీ సినిమా రిలీజ్ తర్వాత ప్రేక్షకుల నుండి కూడా ఇదే వాదన రావడంతో ఇప్పుడు తగ్గక తప్పలేదు.

Telugu Ravi Teja, Tigernageswara-Movie

ఇప్పుడు ఈ సినిమాకు దాదాపు 20 నిముషాలకు పైగా నిడివి తగ్గించి ఫస్ట్ హాఫ్, సెకండాఫ్ నుండి కొన్ని సన్నివేశాలను తీసేసారత్.ఇప్పుడు ఈ సినిమా 2.37 నిముషాల నిడివితో కొత్త ఎడిటింగ్ వర్షన్ ను ప్రేక్షకులు చూడనున్నారు.మరి ఇదైనా ప్రేక్షకులను ఆకట్టుకుని కలెక్షన్స్ పెరుగుతాయో లేదో చూడాలి.

కాగా ఈ సినిమాలో రవితేజ సరసన నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా నటించారు.అలాగే జివి ప్రకాష్ కుమార్ స్వరాలు అందించగా లాంగ్ రన్ లో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube