తెలంగాణలో నియంతృత్వ పాలన..: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

తెలంగాణలో నియంతృత్వ పాలన సాగుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు.బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.

ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రూ.40 వేల కోట్లను దారి మళ్లించారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.బీఆర్ఎస్ పాలనలో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ మూతపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి నమ్మేందుకు ప్రజలు కూడా రెడీగా లేరన్నారు.ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తాము అధికారంలోకి రాగానే షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని తెలిపారు.

చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య...

తాజా వార్తలు