రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ఎల్లారెడ్డిపేట మండలంలో వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో మండల యువజన అధ్యక్షుడు బానోత్ రాజు నాయక్ మాట్లాడుతూ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వ అధికారులకు డిమాండ్ చేశారు.
ఇంతకుముందు జరిగిన ప్రతి సంచికి మూడు నుంచి నాలుగు కిలోల కటింగు నిర్వహించకుండ కేవలం 40 కిలోల కాంట చేయాలని డిమాండ్ చేశారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్( Oggu balaraju yadav ) మాట్లాడుతూ మండల వ్యాప్తంగా వరి కోతలు ప్రారంభమైన దృష్ట్యా కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
వర్షాకాలం వర్షం పడే అవకాశం ఉన్నందున నష్ట పరిహారం జరగకుండా ముందస్తు టార్ఫాలిన్ కవర్లు అవసరమైన చోట తాత్కాలిక షెడ్డు ఏర్పాటు చేయాలని కోరారు.అంతేకాకుండా రాత్రిపూట విద్యుత్ లైట్లను ఏర్పాటు చేసి రైతులకు( Farmers ) ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రోడ్డ రామచంద్రం,పట్టణ అధ్యక్షుడు చిన్ని బాబు, కిసాన్ సేల్ జిల్లా కార్యదర్శి వంగ మల్లారెడ్డి,బిసి సెల్ మండల ఉపాధ్యక్షులు బుచ్చిలింగం సంతోష్ గౌడ్,పుల్లయ్య గారి తిరుపతి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ బిపేట రాజు, నర్సింలు,దేవరాజు,వీర్నపల్లి మండల కాంగ్రెస్ నాయకులు పరమాల మల్లేష్ యాదవ్, మహిళా ప్రధాన కార్యదర్శి పిట్ల పల్లవి,మొగుల్ల మధు, మైనార్టీ సెట్ మండల అధ్యక్షుడు రఫిక్ తదితరులు పాల్గొన్నారు.







