అనిల్, దిల్ రాజు కాంబో రిపీట్.. హీరోగా మెగాస్టార్?

మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలను చేస్తున్నాడు.చేతిలో కనీసం మూడు నాలుగు ప్రాజెక్టులు ఉండేలా చూసుకుంటున్నాడు.

 Chiranjeevi To Team Up With Director Anil Ravipudi Details, Chiranjeevi, Directo-TeluguStop.com

మెగాస్టార్ ఈ మధ్యనే రెండు సినిమాలను ప్రకటించాడు.మెగా 156, 157 సినిమాలు ప్రకటించాడు.

చిరు 156వ ప్రాజెక్ట్ ను మెగాస్టార్ కూతురు తన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించనున్నట్టు అఫిషియల్ గా ప్రకటించారు.ఇక చిరు 157వ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు భారీ స్థాయిలో నిర్మించనున్నారు.

బింబిసార డైరెక్టర్ వసిష్ఠ మల్లిడి( Director Vasishta ) తెరకెక్కిస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసారు.ఇవి అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్నాయి.

ఈ రెండు లైనప్ లో ఉండగానే మరో సినిమా గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి.మెగాస్టార్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి,( Anil Ravipudi ) సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు( Dil Raju ) కాంబోలో ఒక సినిమా చేయబోతున్నట్టు టాక్ నెట్టింట వైరల్ అవుతుంది.ప్రస్తుతం అనిల్ చేసిన భగవంత్ కేసరి సినిమా( Bhagavanth Kesari ) మొన్న రిలీజ్ అయ్యి మంచి టాక్ తో దూసుకు పోతుంది.

దీంతో మెగాస్టార్ అనిల్ రావిపూడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే తెలుస్తుంది.లేటెస్ట్ సమాచారం ప్రకారం అనిల్, దిల్ రాజు కాంబోలో ఒక భారీ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కించనున్నారని అందులో మెగాస్టార్ హీరోగా నటిస్తున్నాడని టాక్ వైరల్ అవుతుంది.ఈ ప్రాజెక్ట్ పై ప్రజెంట్ చర్చలు జరుగుతున్నాయని దీనిపై క్లారిటీ కూడా త్వరలోనే వస్తుందని టాక్.

చూడాలి ఏం జరుగుతుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube