మారుతున్న ఈ జీవనశైలి కారణంగా క్యాన్సర్ కు దారి తీస్తోంది.మెడికల్ విద్య అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఈ వ్యాధికి ఇప్పటికీ కూడా పూర్తి స్థాయి లేదు.
WHO ప్రకారం క్యాన్సర్ ( Cancer )అనే వ్యాధి 2020 లో కోటి మందికి పైగా మరణాలకు కారణమైంది.అయితే ఈ గణాంకాలను పరిశీలిస్తే ప్రతి ఆరుగురిలో ఒకరు క్యాన్సర్ కారణంగానే మరణిస్తుండడం మరింత ఆందోళనకు దారితీస్తుంది.
అయితే క్యాన్సర్ సంకేతాలను ముందుగానే గుర్తిస్తే సులభంగా చికిత్స చేయించుకోవచ్చు.అయితే సాధారణంగా చాలామందికి మెడ నొప్పి( Neck pain ) వస్తూ ఉంటుంది.
దీనికి సరైన భంగిమ లేకపోవడం లాంటి అనేక కారణాలు అయి ఉండవచ్చు.అయితే ఇది తీవ్రమైన సమస్య కాదు.
కానీ ఈ నొప్పి చాలా కాలం పాటు కొనసాగితే మాత్రం అది ఒక వ్యాధికి సంకేతం అవుతుంది.మెడ నొప్పి తీవ్రమైన సమస్యగా మారితే ఇది ఒక క్యాన్సర్ లక్షణం కావచ్చు.దాని లక్షణాలు ప్రమాద కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.క్యాన్సర్ ఇప్పుడు సాధారణ సమస్యగా మారిపోయింది.దీనికి తప్పు భంగిమలో కూర్చోవడం, మెడను చాలాసేపు వంచి కూర్చోవడం, కండరాలు పట్టడం, తప్పు భంగిమలో పడుకోవడం లాంటి అనేక కారణాలు ఉంటాయి.ఇది మెడలో నొప్పిని కూడా కలిగిస్తుంది.
నొప్పి పదేపదే రావడం లేదా తగ్గకపోవడం ఆందోళనకు కలిగించే విషయం.తరచుగా మెడ నొప్పి ఉంటే తల క్యాన్సర్ లక్షణం కావచ్చు.మెడ క్యాన్సర్ ప్రధాన లక్షణాలు, గొంతు మంట, తలనొప్పి, మెడ నొప్పి తగ్గకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నోటిలో లేదా నాలుకపై ఒక పొక్కులు, దవడ లేదా మెడవాపు,ముక్కు నుండి రక్తం కారడం, చెవి నొప్పి, లేదా ఇన్ఫెక్షన్ లాంటి లక్షణాలు ఉంటే ఇది మెడ క్యాన్సర్ కావచ్చు.అందుకే ఇలాంటి లక్షణాలు ముందుగానే గుర్తించి వెంటనే క్యాన్సర్ కు సరైన చికిత్స చేయించుకోవడం మంచిది.