సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు సక్సెస్ సాధించడం వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయి.అయితే కొందరు హీరోయిన్లు ఆ స్టేటస్ ను అందుకోవడం వెనుక ఎన్నో కష్టాలను అనుభవించిన సందర్భాలు సైతం ఉంటాయి.
రయీస్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి దగ్గరైన మహీరా ఖాన్( Mahira Khan ) 17 సంవత్సరాల వయస్సులో తాను చదువుకోవడానికి అమెరికా వెళ్లానని అయితే అమెరికాలో సైతం తాను ఎన్నో ఇబ్బందులు అనుభవించానని మహీరా ఖాన్ పేర్కొన్నారు.
అమెరికాలో( America ) చదువుకునే చదువుకునే సమయంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నానని మహీరా ఖాన్ చెప్పుకొచ్చారు.
డబ్బుల కోసం తాను ఫ్లోర్లు కూడా తీశానని ఆమె తెలిపారు.తాను టాయిలెట్లను సైతం కడిగానని ఆమె పేర్కొన్నారు.ప్రస్తుతం పాకిస్తానీ( Pakistan ) సినిమాలలో మాత్రమే నటిస్తున్న మహీరా ఖాన్ పరిస్థితులు ఎలాంటి పనులను అయినా చేయిస్తాయని వెల్లడించడం గమనార్హం.

అయితే మహీరా ఖాన్ లా కెరీర్ తొలినాళ్లలో ఇబ్బందులను ఎదుర్కొన్న హీరోయిన్లు ఎక్కువమంది ఉన్నారు.సలీమ్ కరీమ్( Saleem Karim ) అనే పాకిస్తానీ బిజినెస్ మేన్ ను ఆమె పెళ్లి చేసుకున్నారు.మహీరా ఖాన్ కు ఈ పెళ్లి రెండో పెళ్లి కాగా పెళ్లి తర్వాత ఆమె సంతోషంగా జీవనం సాగిస్తున్నారు.
గత కొంతకాలంగా ఆమె కొత్త సినిమాలకు దూరంగా ఉన్నారు.ప్రస్తుతం ఈ బ్యూటీ టీవీ షోలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

టాయిలెట్లు కడిగే స్థాయి నుంచి ఈ స్థాయికి చేరుకోవడం అంటే గొప్ప విషయమేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.మహీరా ఖాన్ సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మహీరా ఖాన్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుని సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.ఇన్ స్టాగ్రామ్ లో ఈ బ్యూటీకి 10 మిలియన్ల కంటే ఎక్కువమంది ఫాలోవర్లు ఉండటం గమనార్హం.







