వీడియో: సెకన్లలోనే డజన్ల కొద్దీ వాహనాలను ధ్వంసం చేసిన ట్రక్కు డ్రైవర్.. చాలామంది స్పాట్‌డెడ్..!

యాక్సిడెంట్స్‌కు ( Accidents ) సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే వీడియోలు రోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.తాజాగా అలాంటి మరో వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది, ఇది చూసిన తర్వాత మీకు భయం పుట్టడం ఖాయం.

 Truck Crashes Into Multiple Vehicles In Video Viral Details, East Kalimantan, In-TeluguStop.com

ఎందుకంటే ఈ వీడియో చాలా భయానకంగా ఉంది.వైరల్ అవుతున్న ఈ వీడియోలో ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ వద్ద చాలా వెహికల్స్( Vehicles ) ఒకదాని వెనుక ఒకటి ఆగి ఉండటం చూడవచ్చు.

ఈ వాహనాలన్నీ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నాయి.

అందులో టూ-వీలర్స్‌, ఫోర్ వీలర్స్ కూడా ఉన్నాయి.ఇవన్నీ ఇలా వెయిట్ చేస్తుండగా వెనకనుంచి ఒక పెద్ద ట్రక్కు ( Truck ) చాలా వేగంగా దూసుకొచ్చింది.అదుపు తప్పిన ఈ ట్రక్కు ముందు ఆగి ఉన్న పదుల సంఖ్యలో వాహనాలను ఢీకొట్టింది.

అన్ని వాహనాలపైకి ఆ ట్రక్కు దూసుకెళ్తూ వాటిని తొక్కేస్తూ, పక్కకు నెట్టేస్తూ వెళ్లడం వీడియోలో చూడవచ్చు.దాని దెబ్బకు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

స్ట్రీట్ లైట్ పోల్స్ కూడా లేచి నేలమీద పడ్డాయి.ఈ వీడియో తాజాగా వైరల్ అవుతుండగా ఈ సంఘటన 2022, జనవరిలో ఇండోనేషియాలోని( Indonesia ) తూర్పు కాలిమంటన్‌లో జరిగింది.

ఈ ఘటనలో చాలా మంది చనిపోయారు.కాగా పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా గాయపడ్డారు.ఈ యాక్సిడెంట్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అమర్చిన కెమెరాలో రికార్డ్ అయింది, దీనికి సంబంధించిన వీడియో నేటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.48 ఏళ్ల ట్రక్కు డ్రైవర్ ఈ ఘటనకు పాల్పడ్డాడు.ట్రక్కు బ్రేకులు ఫెయిలయ్యాయని, దాని వల్లే ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని విచారణలో చెప్పాడు.ఈ యాక్సిడెంట్ వీడియో చూసిన తర్వాత చాలా మంది యూజర్లు తాము చాలా షాక్ అయినట్టు కామెంట్స్‌ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube