రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) ఇల్లంతకుంట మండలం నర్శక్కపేట గ్రామంలో కిరాణా షాపులో బెల్ట్ షాపు నిర్వహిస్తూ అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తున్నాడని సమాచారం మేరకు రాత్రి పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని మద్యాన్ని అమ్ముతున్న ముత్యం రాములు షాపులో నుండి పదకొండు వేల (11,000/-)రూపాయల విలువ చేసే తొమ్మిది లీటర్ల మద్యం సీజ్( Liquor Sieze ) చేసి, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బెల్ట్ షాపు యజమాని పైన కేసు నమోదు చేయడం జరిగిందని ఇల్లంతకుంట ఎస్సై డి.సుధాకర్ తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అనుమతి లేకుండా అక్రమంగా ఎవరైనా మద్యాన్ని విక్రయిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్సై సుధాకర్( SI Sudhakar ) హెచ్చరించారు.ప్రభుత్వ అనుమతి పొందిన వైన్ షాపులు కాకుండా బయట ఎక్కడైనా మద్యాన్ని అక్రమంగా విక్రయించినట్లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, అటువంటి వారి సమాచారాన్ని పోలీసువారికి అందించాలని కోరారు.
ఎస్సై వెంట హెడ్ కానిస్టేబుల్ భూమయ్య తిరుపతి, మధు లు ఉన్నారు.