Pavala Syamala : దయనీయంగా పావలా శ్యామల పరిస్థితి.. డబ్బులు, తిండి లేక ఆత్మహత్య గతి అంటూ?

సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల జీవితాలు ఎప్పుడు ఎలా మారిపోతాయో చెప్పడం అంచనా వేయడం చాలా కష్టం.ఒకప్పుడు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన తారలు ఆ తర్వాత కనీసం తినడానికి కూడా తిండి లేక నానా అవస్థలు పడడంతో పాటు అనాధలుగా మారి చనిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు.

 Pavala Syamala Health And Financial Condition Worsening-TeluguStop.com

ఇంకొందరు అయితే చివరి రోజుల్లో ఎవరూ లేక అనాధ శవాలుగా మారిన వారు కూడా చాలామంది ఉన్నారు.ప్రస్తుతం ప్రముఖ తెలుగు లేడీ కమెడియన్ పావలా శ్యామల( Pavala Syamala ) పరిస్థితి కూడా అలాగే ఉంది.

ఒకప్పుడు వెండితెరపై ఒక వెలుగు వెలగడంతో పాటు తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన పావలా శ్యామలా పరిస్థితి ప్రస్తుతం అతి దారుణంగా ఉంది.

Telugu Financial, Lady, Pavala Syamala, Tollywood-Movie

250కు పైగా సినిమాలలో నటించిన పావలా శ్యామల లేడీ కమెడియన్గా ( Lady comedian )తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరుచుకుంది.తినడానికి తిండి లేక తనను కాపాడండి అంటూ చేతులెత్తి ప్రతి ఒక్కరిని అర్థిస్తోంది.ద‌యనీయ జీవితం గడుపుతున్న నటి పావలా శ్యామల జీవిత క‌థ ప్ర‌తి ఒక్క‌రిని కంటతడి పెట్టిస్తోంది.

కాగా చాలాకాలంగా దయనీయ జీవితం గడుపుతోంది.ఒకవైపు ఆర్ధిక భారం, మరోవైపు వయోభారం ఆమెకు నరకం చూపిస్తున్నాయి.

అంతేకాకుండా ఎదిగిన కూతురు మంచానికి పరిమితమవ్వడం ఆమెకు మనోవేదనను కలిగిస్తోంది.గతంలో ఆమెకు కొంత మంది నుంచి సాయం అందినా అవి తాత్కాలిక ఉపశమనం మాత్రమే కల్గించాయి.

తనకు తినడానికి తిండి లేక చివరికి తనకు వచ్చిన అవార్డులను అమ్ముకొని ఆ డబ్బుతో బియ్యం, పప్పులు కొనుకొన్న రోజులు కూడా ఉన్నాయి.

Telugu Financial, Lady, Pavala Syamala, Tollywood-Movie

ఇది ఇలా ఉంటే తాజాగా మరోసారి ఆమె తన ఆవేదనను వ్యక్తం చేసింది.అనారోగ్యం( Health condition )తో ఉన్న తాము తినడానికి తిండి లేక ఒక్కోసారి ఐదు రోజులు పస్తులుండాల్సి వ‌చ్చింద‌ని తెలిపింది.అలాంటిది ఇక మందులు ఎక్కడి నుంచి కొనుక్కోగలమని బాధపడింది.

పరిస్థితులు ఇలాగే ఉంటే ఏదో ఒక రోజు ఇద్దరం మంచంలోనే ఆకలితో చనిపోతామని కంటతడి పెట్టుకుంది.ఆత్మహత్య చేసుకోవడానికి ధైర్యం సరిపోవడం లేదు అని ఆమె తెలిపింది.

అయితే ఆమె పరిస్థితి తెలిసి దయ తలిచి ఆమెకు సహాయం చేయాలి అనుకున్న ఈ కింది అకౌంట్ నెంబర్ కు డబ్బులు పంపించగలరు Neti Shyamala, A/c: 52012871059, IFSC :SBIN0020458, Srikrishna Nager, Yusuf guda Branch, Hyderabad , Cell : 9849175713.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube