రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన కుటుంబ సభ్యులు ఇవాళ ములాఖత్ కానున్నారు.ఈ మేరకు మధ్యాహ్నం 3 గంటలకు భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి ఆయనను కలవనున్నారు.
ఇప్పటికే గన్నవరం నుంచి రాజమండ్రికి చేరుకున్న లోకేశ్ కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు.మరోవైపు న్యాయవాదులు సైతం చంద్రబాబుతో రోజుకు ఒకేసారి ములాఖత్ కావాలని జైలు అధికారులు తెలిపారు.
భద్రతా చర్యలు దృష్ట్యా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.అయితే న్యాయపరమైన అంశాలను చర్చించేందుకు లాయర్లకు రోజుకు రెండుసార్లు కలిసే అవకాశం ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
కాగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.