ఈ మూడు ఉంటే చాలు స్పాట్ లెస్ స్కిన్ మీ సొంతం అవుతుంది!

ముఖ సౌందర్యాన్ని పాడు చేయడంలో మచ్చలు ముందు వరుసలో ఉంటాయి. చర్మం( skin ) ఎంత మృదువుగా, తెల్ల‌గా ఉన్నా అక్కడక్కడ కనిపించే మచ్చలు ముఖాన్ని కాంతి హీనంగా చూపిస్తాయి.

 Miracle Home Remedy For Getting Spot Less Skin , Home Remedy, Spot Less Ski-TeluguStop.com

అందుకే ఎలాంటి మచ్చ లేకుండా ముఖ చర్మం మెరిసిపోతూ కనిపించాలని అందరూ కోరుకుంటారు.కానీ అటువంటి చర్మం చాలా తక్కువ మందికే దొరుకుతుంది.

అలాంటి వారు కనిపించినప్పుడు కొంచెం కాదు కాస్త ఎక్కువే అసూయ కలుగుతుంది. అసూయ పడడం ఎందుకు మీరు అలాంటి చర్మాన్ని పొందాలనుకుంటే ఇప్పుడు చెప్పబోయే రెమెడీ ని ఫాలో అవ్వండి.

ఈ రెమెడీ ఎలాంటి మచ్చలనైనా మాయం చేస్తుంది.స్పాట్ లెస్ స్కిన్ ( Spotless skin )ను మీ సొంతం చేస్తుంది.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా కొన్ని వేపాకులను సేకరించి వాటర్ తో శుభ్రంగా కడిగి ఎండబెట్టుకోవాలి.

పూర్తిగా ఎండిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఈ పౌడర్ ను ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.

Telugu Tips, Clear Skin, Face, Remedy, Skin Care, Skin Care Tips, Spot Skin-Telu

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు వేపాకు పొడి ( Neem powder )వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ తేనె, సరిపడా రోజు వాటర్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకుని మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.

Telugu Tips, Clear Skin, Face, Remedy, Skin Care, Skin Care Tips, Spot Skin-Telu

వేపాకు, తేనె( Honey ), రోజ్ వాటర్.ఈ మూడింటిలో ఉండే పలు సుగుణాలు ఎలాంటి మచ్చలనైనా మాయం చేస్తాయి.చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి.మొటిమల సమస్యకు చెక్ పెడతాయి.కాబట్టి ముఖంపై మచ్చలు సమస్యతో బాధపడుతున్న వారు ఈ సింపుల్ అండ్ మిరాకిల్ రెమెడీని పాటించండి. స్పాట్ లెస్ స్కిన్ ను మీ సొంతం చేసుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube