అనేక కాలిఫోర్నియా స్కూల్స్‌కు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన అధికారులు..

సోమవారం మధ్యాహ్నం దక్షిణ కాలిఫోర్నియాలోని( Southern California ) కొన్ని కాథలిక్ పాఠశాలలకు భయపెట్టే ఈ-మెయిల్స్ వచ్చాయి.ఆ స్కూళ్ల క్యాంపస్‌లపై బాంబులు వేస్తామని బెదిరించే స్పామ్ ఈ-మెయిల్స్‌ను పాఠశాల నిర్వహకులు అందుకున్నారు.

 Threatening Emails Sent To Catholic Schools In California Details, Bomb Threat,-TeluguStop.com

అవి అందుకున్న పాఠశాల యాజమాన్యాలు కంగుతున్నాయి.వెంటనే క్లాసెస్ క్యాన్సిల్ చేశాయి.

ఈ తరహా ఈ-మెయిల్స్‌ గత వారం యూరప్‌లోని పాఠశాలలు, సంస్థలకు కూడా పంపించడం జరిగింది.ఎవరు పంపారు అనేది తెలియ రాలేదు కానీ అవి ఫేక్ ఈమెయిల్స్( Spam Emails ) అని తెలిసింది.

భయాందోళనలు, అంతరాయం కలిగించే ఉద్దేశ్యంతో వీటిని పంపించారని అధికారుల విచారణలో వెళ్లడైంది.

Telugu Archdioceselos, Bomb Threat, False Alarm, Law, Spam Email-Telugu NRI

ఈమెయిల్స్‌ అందుకున్న పాఠశాలల్లో క్లేర్‌మాంట్‌లోని అవర్ లేడీ ఆఫ్ ది అజంప్షన్ స్కూల్, లా వెర్న్‌లోని డామియన్ హై స్కూల్, లా ప్యూంటెలోని బిషప్ అమత్ హై స్కూల్ ఉన్నాయి.మూడు పాఠశాలలు ముందుజాగ్రత్త చర్యగా తమ విద్యార్థులను, సిబ్బందిని ఖాళీ చేయించి స్థానిక చట్ట అమలు సంస్థలను సంప్రదించాయి.ఈ ప్రాంతంలోని క్యాథలిక్ పాఠశాలలను( Catholic Schools ) పర్యవేక్షిస్తున్న లాస్ ఏంజిల్స్ ఆర్చ్ డియోసెస్, ముప్పు నమ్మదగినదని సూచించడానికి ఎటువంటి ఆధారాలు లేవని ఒక ప్రకటన విడుదల చేసింది.

విద్యార్థులు, సిబ్బంది భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యమని, వారి భద్రత కోసం అధికారులతో కలిసి పనిచేస్తున్నామని ప్రకటనలో పేర్కొంది.

Telugu Archdioceselos, Bomb Threat, False Alarm, Law, Spam Email-Telugu NRI

లా వెర్న్ పోలీస్ డిపార్ట్‌మెంట్ బెదిరింపు ఈమెయిల్స్ విదేశాల నుంచి వచ్చినట్లు తెలిపింది.ఇవి నమ్మదగినవి కాదని కూడా వారు స్పష్టం చేశారు.డామియన్ హైస్కూల్‌ను( Damien High School ) కలిగి ఉన్న బోనిటా యూనిఫైడ్ స్కూల్ డిస్ట్రిక్ట్ ముప్పు బారిన పడలేదని, ఓపెన్ అయి ఉందని పోలీసు శాఖ తెలిపింది.

అవర్ లేడీ ఆఫ్ ది అజంప్షన్, బిషప్ అమత్ హైస్కూల్ ప్రిన్సిపాల్స్ కూడా తమ పాఠశాల సంఘాలకు ముప్పు నమ్మశక్యంగా లేదని, వారు క్యాథలిక్ స్కూల్స్ డిపార్ట్‌మెంట్( Department of Catholic Schools ) ఆదేశాలను పాటిస్తున్నారని తెలియజేశారు.ఈ ఘటనలో తమ విద్యార్థులు, సిబ్బంది, తల్లిదండ్రులు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube