తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.ఈ క్రమంలో మొదటి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్ పొలిటికల్ ఈక్వేషన్స్ పై దృష్టి సారించింది.
ఇందులో భాగంగా ప్రధానంగా బీఆర్ఎస్ ముఖ్యనేతలు పోటీ చేస్తే నియోజకవర్గాలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది.ఈ క్రమంలోనే బలమైన నేతలను పార్టీలోకి తీసుకొని టికెట్లు ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి యోచనలో ఉన్నారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో మండవ వెంకటేశ్వర రావు, ఏనుగు రవీందర్ రెడ్డితో పాటు రేవూరి ప్రకాశ్ రెడ్డిని తీసుకోవాలనుకుంటున్నారని సమాచారం.కాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై బలమైన ప్రత్యర్థిని దింపాలని చూస్తున్న కాంగ్రెస్ రేపైరి ప్రకాశ్ రెడ్డిని బరిలోకి దింపాలని భావిస్తోంది.
అలాగే మండవకు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, ఏనుగు రవీందర్ రెడ్డికి బాన్సువాడ నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ యోచనలో ఉందని తెలుస్తోంది.అందులో భాగంగా ఈ నేతలతో రేవంత్ రెడ్డి మంతనాలు చేస్తున్నారని సమాచారం.







