పోలీసులకు, ఆర్మీ అధికారులకు రూ.20 లక్షల విరాళం ఇచ్చిన సాయితేజ్.. గ్రేట్ అంటూ?

సినిమా ఇండస్ట్రీలో కోట్ల సంఖ్యలో పారితోషికం తీసుకునే హీరోలు పదుల సంఖ్యలో ఉంటే ఈ హీరోలలో దానం చేసే గుణం ఉన్న హీరోలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు.టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన సాయితేజ్ వరుస సినిమాలతో బిజీగా ఉండగా నిన్న సాయితేజ్( Saitej ) పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా జరిగాయి.

 Young Hero Saitej Kind Heart Details Here Goes Viral In Social Media-TeluguStop.com

ఈ ఏడాది విడుదలైన విరూపాక్ష మూవీ( Virupaksha movie ) సాయితేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.అయితే సాయితేజ్ పోలీసులకు 10 లక్షల రూపాయలు, ఆర్మీ అధికారుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చి మంచి మనస్సును చాటుకున్నారు.

తన సినీకెరీర్ లో ఎన్నో ప్రయోగాత్మక సినిమాలలో నటించిన సాయితేజ్ ఆర్మీ అధికారుల భార్యలకు 10 లక్షల రూపాయలు, ఏపీ టీఎస్ పోలీసులకు 10 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు.

Telugu Saitej-Movie

మెగా హీరో( Mega hero ) మంచి మనస్సును ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సాయితేజ్ కొత్త మూవీ గాంజా శంకర్ టైటిల్ తో తెరకెక్కుతోంది.డైరెక్టర్ సంపత్ నంది ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

సంపత్ నందికి( Sampath Nandiki ) ఈ సినిమా సక్సెస్ కెరీర్ పరంగా కీలకమనే సంగతి తెలిసిందే.ఈ సినిమా కమర్షియల్ రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.

Telugu Saitej-Movie

విరూపాక్ష సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.విరూపాక్ష సీక్వెల్ ను భారీ బడ్జెట్ తో తెరకెక్కించి పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.త్వరలో ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.సాయితేజ్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి త్వరలో మరిన్ని ప్రకటనలు రానున్నాయి.సాయితేజ్ భారీ విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube