పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ( Prabhas ) ప్రస్తుతం వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో నటించినటువంటి సలార్ సినిమా ( Salaar Movie ) ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.
ఇలా ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది.ప్రశాంత్ వంటి స్టార్ డైరెక్టర్ ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ హీరో కాంబినేషన్లో సినిమా అంటేనే సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ప్రభాస్ ఈ ఏడాది క్రిస్మస్ పండుగ సందర్భంగా సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సినిమా పట్ల అభిమానులు కూడా ఎంతో ఆత్రుత కనబరుస్తున్నారు.
ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ ఇతర సినిమా షూటింగ్ పనులలో కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇదిలా ఉండగా తాజాగా ప్రభాస్ ఇంస్టాగ్రామ్( Prabhas Instagram ) అకౌంట్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రభాస్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ డి ఆక్టివేట్ కావడంతో ఈయన ఇంస్టాగ్రామ్ ఎవరో హ్యాక్ చేశారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఇకపోతే సోషల్ మీడియాల్లో అవాంచితంగా పుట్టుకొచ్చిన డమ్మీ ఖాతాలను సదరు ప్లాట్ ఫామ్ లు తొలగిస్తున్నాయి.24 గంటలలోపే ప్లాట్‌ఫామ్ నుంచి చాలామంది ఖాతాలు అదృశ్యమయ్యాయి.ఈ క్రమంలోనే ప్రభాస్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ కూడా డి ఆక్టివేట్( Prabhas Instagram De Activate )) అయినట్లు తెలుస్తోంది.
మరి ప్రభాస్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఎవరైనా హ్యాక్( Instagram Hack ) చేశారా లేకపోతే ఆయనే డిఆక్టివేట్ చేశారా అనే విషయం తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ప్రభాస్ సోషల్ మీడియా ఖాతా గురించి ఇలాంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు ప్రభాస్ టీం ఈ వార్తలను ఖండించకపోవడం అలాగే ఈ వార్తలపై ఏ విధంగా రియాక్ట్ కాకపోవడంతో ఇది నిజమా కాదా అన్న సందిగ్ధంలో అభిమానులు ఉన్నారు.గతంలో కూడా ఒకసారి ప్రభాస్ ట్విట్టర్ అకౌంట్ ఇలాగే హ్యాక్ చేసిన సంగతి మనకు తెలిసిందే.
అయితే వెంటనే ప్రభాస్ టీమ్ స్పందించి వివరణ ఇచ్చారు.కానీ ఇంస్టాగ్రామ్ అకౌంట్ గురించి ఇప్పటివరకు ప్రభాస్ టీమ్ ఏమాత్రం స్పందించకపోవడం గమనార్హం.