తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ ( Bigg Boss 7 ) కార్యక్రమం ఉల్టా పుల్టా అంటూ నాగార్జున మొదటి నుంచి ఈ సీజన్ గురించి భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తూ వచ్చారు.అయితే నాగార్జున చెప్పిన విధంగానే ఉల్టా పుల్టా అంటూ ఊహించని విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ఐదుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిన విషయం మనకు తెలిసిందే.ఈరోజు మరొక కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ కానున్నారు.
ఇక శనివారం జరిగిన ఎపిసోడ్ లో భాగంగా నాగార్జున( Nagarjuna ) హౌస్ మెట్లతో మాట్లాడుతూ వారి తప్పు ఒప్పులను వారికి తెలియజేస్తూ తన స్టైల్ లో వారికి క్లాస్ పీకారు.
ఇక శనివారం ఎపిసోడ్ చివరిలో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్లకు మాత్రమే కాకుండా ప్రేక్షకులకు కూడా షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు.బిగ్ బాస్ ఇదివరకే ఎలిమినేట్ అయినటువంటి శుభ శ్రీ, దామిని, రతిక ముగ్గురిని కూడా వేదిక పైకి తీసుకువచ్చారు.అయితే వీరిలో మీ అందరి నిర్ణయం ప్రకారం ఒక కంటెస్టెంట్ ను హౌస్ లోకి పంపించబోతున్నాము అంటూ నాగార్జున చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.
ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా నాగార్జున తిరిగి ఈ ముగ్గురిలో ఒక కంటెస్టెంట్ ను( Eliminated Contestants ) హౌస్ లోకి పంపించబోతున్నారని తెలుస్తోంది.
ఇలా ఈ ముగ్గురిలో ఎవరు హౌస్ లోకి వెళ్తారు అనే విషయం తెలియాల్సి ఉంది అయితే ఈ ముగ్గురిలో హౌస్ లోకి పంపించబోతున్నారని విషయం తెలియడంతో నేటిజన్స్( Netizens ) వివిధ రకాలుగా స్పందిస్తున్నారు ఈ ముగ్గురు ఓట్లు తక్కువగా రావటం వల్ల హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.అయితే ఓట్లు తక్కువగా వచ్చాయి అంటే వీరు బిగ్ బాస్ కార్యక్రమం( Bigg Boss Show )లో ఉండటానికి ప్రేక్షకులు ఇష్టపడకపోవడం వల్లే వారిని ఎలిమినేట్ చేశారని, అలాంటిది తిరిగి వారిని హౌస్ లోకి పంపిస్తే ప్రేక్షకులు ఓట్లు వేసినా కూడా ఆ ఓట్లకు ఎలాంటి ప్రాధాన్యత లేదనే కదా అర్థం అంటూ కొందరు ఈ విషయంపై కామెంట్స్ చేస్తున్నారు.