పొన్నాల లక్ష్మయ్య ఎఫెక్ట్ తో హస్తం గూటికి పల్లా రాజేశ్వర్.. నిజమేనా..?

తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ (Congress) పార్టీ ముందుకుపోతోంది.కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సైతం తెలంగాణలో అధికారం కోసం స్పెషల్ గా ఫోకస్ చేస్తుంది.

 If Ponnala Lakshmaiah Joins Brs Will Palla Rajeshwar Reddy Join Congress Details-TeluguStop.com

ఇప్పటికే పార్టీ అగ్రనేతలు తెలంగాణలోని వివిధ నియోజకవర్గాల్లో తిరిగి హస్తం పార్టీ నేతల్లో కొత్త జోష్ నింపారు.ఇక రేవంత్ రెడ్డి (Revanth Reddy) వచ్చాక చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలకి కొత్త ఊపు వచ్చినప్పటికీ గతంలో ఉన్న సీనియర్ నాయకులు మాత్రం ఆయనను ప్రతిసారి వెనక్కి లాగుతున్నారు.

కానీ ఈ విషయంపై దృష్టి సారించిన కాంగ్రెస్ అధిష్టానం ఎలాగైనా అందరూ కలిసికట్టుగా ఉండి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చూస్తున్నారు.

ఓ పక్క కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని చూస్తున్నా సీనియర్ నాయకులకు చాలా రోజుల నుండి పార్టీలో కొనసాగుతున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి షాకిస్తున్నారు.

తాజాగా పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) పార్టీకి రాజీనామా చేసిన సంగతి మనకు తెలిసిందే.బీసీలకు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి న్యాయం జరగడంలేదని అలాగే అభ్యర్థులు ఎంపిక విషయంలో తనకి తీవ్ర అన్యాయం జరిగిందనే అసంతృప్తితో ఉన్న పొన్నాల లక్ష్మయ్య పార్టీకి రాజీనామా చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి మల్లికార్జున కార్గేకి లెటర్ రాశారు.

Telugu Congress, Mutthiyadagiri, Pallarajeshwar, Rahul Gandhi, Revanth Reddy, Te

అలాగే త్వరలోనే పొన్నాల లక్ష్మయ్య బిఆర్ఎస్ పార్టీలోకి( BRS ) చేరుతారని సమాచారం అందుతుంది.ఇప్పటికే కేటీఆర్ సైతం పొన్నాల లక్ష్మయ్యని మీట్ అయినట్టు వార్తలు వచ్చాయి.అయితే బిఆర్ఎస్ పార్టీలో పొన్నాల లక్ష్మయ్యకి ప్రాధాన్యత తీస్తామని కేసీఆర్, కేటీఆర్ (KTR) హామీ ఇచ్చారట.అంతేకాకుండా జనగామ జిల్లాలో( Janagama ) ఆయనకు అభ్యర్థిగా టికెట్ ఇవ్వబోతున్నట్టు కూడా సమాచారం వినిపిస్తోంది.

అయితే ఇప్పటికే జనగామ అభ్యర్థుల విషయంలో పల్లా రాజేశ్వర్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మధ్య టఫ్ ఫైట్ జరిగినప్పటికీ ఈసారి పల్లా రాజేశ్వర్ రెడ్డి కి టికెట్ ఇవ్వబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Congress, Mutthiyadagiri, Pallarajeshwar, Rahul Gandhi, Revanth Reddy, Te

అయితే పొన్నాల లక్ష్మయ్య బిఆర్ఎస్ లోకి చేరితే జనగామ టికెట్ విషయంలో పొన్నాల లక్ష్మయ్యని జనగామ అభ్యర్థిగా నిలబెట్టాలని అధిష్టానం భావిస్తుందట.ఒకవేళ ఇదే జరిగితే పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy) ని పక్కకు తప్పించి పొన్నాల లక్ష్మయ్యకి టికెట్ ఇచ్చే దిశగా ఆలోచనలు చేస్తున్నారట కేసీఆర్.ఈ విషయంపై సీరియస్ గా కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

పొన్నాల లక్ష్మయ్య ని జనగామ బరిలో ఉంచి రేవంత్ రెడ్డికి షాక్ ఇవ్వాలని కెసిఆర్ ఆలోచిస్తున్నారని ప్రగతి భవన్ వర్గాల నుండి టాక్ వినిపిస్తోంది.

అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది.

ఏంటంటే ఒకవేళ జనగామలో పొన్నాల లక్ష్మయ్య కి టికెట్ ఇస్తే ఖచ్చితంగా తనకి టికెట్ వస్తుంది అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి కచ్చితంగా హస్తం గూటికి చేరతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇక ఇప్పుడు జనగామ అభ్యర్థి విషయంలో సీఎం కేసీఆర్ (KCR) ఆలోచన ఏ విధంగా ఉంది అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube