భగవంత్ కేసరి( Bhagwant Kesari ) రిలీజ్ కు సమయం దగ్గర పడే కొద్దీ అభిమానులకు టెన్షన్ పెరుగుతోంది. అనిల్ రావిపూడి( Anil Ravipudi ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పటాస్ తర్వాత బాలయ్యతో సినిమా చేయాల్సి ఉన్నా అంతకంతకూ ఆలస్యమైందని తెలిపారు.
బాలయ్యను కొత్తగా చూపించాలని అనుకున్నానని ఈ సినిమాలో అదే విధంగా చూపించానని అనిల్ తెలిపారు.హానెస్ట్ గా భగవంత్ కేసరి కథ చెప్పామని అనిల్ రావిపూడి అన్నారు.
భగవంత్ కేసరి జనాలకు ఎక్కువ రోజులు గుర్తుంటుందని ఆయన తెలిపారు.ఈ సినిమా వర్కౌట్ అవుతుందనే నమ్మకం ఉందని అనిల్ రావిపూడి పేర్కొన్నారు.గతంలో అర్జున్ రెడ్డి పోకిరి, గబ్బర్ సింగ్ తరహాలో హీరోల పాత్రలు ఎంత పవర్ ఫుల్ గా ఉంటాయో అలా భగవంత్ కేసరిలో బాలయ్య పాత్ర దూకుడుగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.సినిమా చూస్తే నా కామెంట్లు అర్థమవుతాయని అనిల్ రావిపూడి పేర్కొన్నారు.

బాలయ్యతో ఈ సినిమా జర్నీ మెమరబుల్ జర్నీ అని అనిల్ వెల్లడించారు.నన్ను నేను మార్చుకోవడానికి ఈ సినిమా మంచి ఛాన్స్ అని అనిపించిందని ఆయన అన్నారు.ఈ సినిమాలో చాలా సర్ప్రైజ్ లు ఉన్నాయని అనిల్ రావిపూడి పేర్కొన్నారు.భగవంత్ కేసరి గెటప్స్ విషయంలో నెగిటివ్ కామెంట్లు రాలేదని ఆయన తెలిపారు.బాలయ్య( Balayya ) వయస్సు తగ్గ పాత్రలో కనిపించారని చాలామంది చెప్పారని అనిల్ రావిపూడి అన్నారు.

భగవంత్ కేసరి రాహుల్ సంఘ్వీ( Rahul Sanghvi ) మధ్య గొడవకు కారణం ఏంటో ఫ్లాష్ బ్యాక్ లో చూపించనున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.భగవంత్ కేసరి సినిమాలో ఒక పాటకు 90 సెకన్ల వీడియోను రీమిక్స్ చేసి యాడ్ చేశామని ఆయన తెలిపారు.భగవంత్ కేసరి సినిమాను మళ్లీమళ్లీ చూస్తారని అనిపిస్తుందని అనిల్ రావిపూడి కామెంట్లు చేశారు.







