ఆ కుటుంబంలో తరచూ భార్యాభర్తల ( Husband and wife )మధ్య గొడవలే.గ్రామ పెద్దలు, కుటుంబ పెద్దలు ఎన్నోసార్లు సర్ది చెప్పి ఆ దంపతులను సంసారానికి పంపించేవారు.
అయినా కూడా ఆ భార్యాభర్తల మధ్య తరచూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉండేది.ఈ క్రమంలోని భార్య గొంతు నులిమి అత్యంత దారుణంగా హత్య చేయడమే కాకుండా.
ఆమె అన్నకు ఫోన్ చేసి మీ చెల్లెలు కనిపించడం లేదని చెప్పిన ఘటన మహబూబ్ నగర్ ( Mahbub Nagar )లో చోటుచేసుకుంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

వివరాల్లోకెళితే.ధరూరు మండలం( Dharur mandal ) మన్నాపురానికి చెందిన పవిత్ర (23) కు ఇర్కిచేడు కు చెందిన నాగేష్ కు మూడేళ్ల క్రితం వివాహమైంది.గత సంవత్సర కాలంగా ఈ భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరగడం ప్రారంభమయ్యాయి.
గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు ఎన్నోసార్లు సర్ది చెప్పి ఈ దంపతులను సంసారానికి పంపించేవారు.
అయినా కూడా ఆ దంపతుల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.ఈ క్రమంలో గురువారం కూడా ఈ దంపతుల మధ్య పెద్ద గొడవ జరిగింది.
దీంతో భార్య గొంతు నులిమి హత్య చేశాడు.హత్య అనంతరం మృతదేహాన్ని గ్రామ శివారులో ఉండే వ్యవసాయ పొలంలో పడేశాడు.
ఆ తర్వాత భార్య అన్నకు ఫోన్ చేసి మీ చెల్లెలు కనిపించడం లేదని తెలిపాడు.

పవిత్ర కుటుంబ సభ్యులు గ్రామానికి వచ్చి గాలించగా శుక్రవారం మృత దేహం ( Dead body )బయటపడింది.వెంటనే కేటీ దొడ్డి పోలీసులకు సమాచారం అందించగా.గద్వాల డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరి మృతదేహాన్ని పరిశీలించారు.
మృతురాలి తండ్రి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
.






