తెలంగాణ(Telangana) రాష్ట్రంలో నవంబర్ 30న ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రజల్లోకి వెళ్లేందుకు సమయుత్తమయ్యాయి.దీంతో చాలామంది నేతలు టికెట్ల కోసం కొట్లాడుతున్నారు.
ముఖ్యంగా కాంగ్రెస్ టికెట్ల కొట్లాట ఇంకా పూర్తి కావడం లేదు.
ఇప్పటికే ఉన్న నేతలకు టికెట్లు సరిపోక సతమత మవుతున్నారు.
ఈ తరుణంలో కొత్త నేతలను కూడా పార్టీలో చేర్చుకుంటున్నారు.దీంతో ఆయా నియోజకవర్గంలో ఇప్పటికే ఉన్నటువంటి నేతలకు మరియు కొత్త నేతలకు మధ్య వర్గ విభేదాలు తలెత్తుతున్నాయి.
ఇదే తరుణంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంతో పేరుగాంచినటువంటి మావోయిస్టు అగ్రనేత గాజర్ల అశోక్(Gajarla Ashok) అలియాస్ ఐతు కాంగ్రెస్ పార్టీలో చేరారు.తాజాగా ఆయన టీపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి(Revanth Reddy) సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఆయనది జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమల్ల మండలం వెలిశాల గ్రామం.
ఈయనకు ఉమ్మడి వరంగల్(Warangal) జిల్లా మొత్తంలో కమ్యూనిస్టు నేతలతో అనేక సంబంధాలు ఉన్నాయి.ఈయన చేరికతో దాదాపు నాలుగు నియోజకవర్గాలపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.1994లో గాజర్ల అశోక్ ఉద్యమంలో చేరారు.దాదాపు 25 సంవత్సరాల పాటు ఉద్యమాల్లో పనిచేసి అనారోగ్యం కారణంగా 2016లో వరంగల్ పోలీస్ ల ఎదుట లొంగిపోయారు.అప్పటినుంచి సదాసీదా జీవనం గడుపుతున్న అశోక్ సిమెంట్ ఇటుకల తయారీ పరిశ్రమ నిర్వహిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.
ఇదే క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పరకాల(Parakala) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతుంది.ఇప్పటికే పరకాల నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి(Konda Murali), ఇనగల వెంకటరామిరెడ్డి(Venkata Ramireddy) ఉన్నారు.
వారిద్దరి మధ్య వర్గ పోరు జరుగుతున్న సమయంలో అశోక్, పార్టీలో చేరడం అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది.అయితే అశోకుని బరిలో దించితే ములుగు, భూపాలపల్లి, నర్సంపేట నియోజకవర్గం మంచి ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ భావిస్తుందట.మరి కొండా మురళిని కాదని కొత్తగా చేరిన అశోక్ టికెట్ ఇస్తారా లేదా అనేది సస్పెన్షన్ నెలకొంది.ఒకవేళ ఆయనకు టికెట్ ఇవ్వకున్నా నామినేటెడ్ పదవుల హామీ ఇస్తుందనేది కూడా ఒక వార్త వినిపిస్తోంది.
ఎందుకంటే గాజర్ల అశోక్ నాలుగు నియోజకవర్గాల్లో ఎంతోమంది కమ్యూనిస్టు నేతలతో సంబంధాలు కలిగి ఉన్నారు.ఆయన కాంగ్రెస్ లో చేరడం వల్ల ఆ ఓట్లన్నీ కాంగ్రెస్ కు కలిసి వచ్చి విజయతీరాలకు వెళ్తారని కాంగ్రెస్(Congress) భావిస్తోంది.