టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సాయిపల్లవికి ( Saipallavi )ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాయిపల్లవి పరిమితంగా సినిమాలలో నటిస్తున్నా పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటిస్తున్నారు.
స్టార్ హీరోలు ఆఫర్లు ఇవ్వకపోవడం సాయిపల్లవికి శాపంగా మారిందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బాలీవుడ్ రామయణంలో సాయిపల్లవి సీత పాత్రలో కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి.

శేఖర్ కమ్ముల ( Sekhar Kammula )డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు నటిగా సాయిపల్లవి రేంజ్ ను పెంచడంతో పాటు ఈ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించాయి.సాయిపల్లవిని శేఖర్ కమ్ముల స్థాయిలో చూపించిన మరో దర్శకుడు కూడా లేరని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.సాయిపల్లవి మంచి డ్యాన్సర్ అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సాయిపల్లవి డ్యాన్స్( Sai Pallavi Dance ) కు ఫిదా అయిన ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.
అయితే శ్రీలీల కూడా అద్భుతంగా డ్యాన్స్ చేస్తుండటంతో సాయిపల్లవి, శ్రీలీలలలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరనే చర్చ జరుగుతోంది.ఒక సర్వేలో సాయిపల్లవికి 50 శాతం కంటే ఎక్కువమంది బెస్ట్ డ్యాన్సర్ అని ఓటు వేయగా 30 శాతం మంది శ్రీలీల బెస్ట్ డ్యాన్సర్ అని తెలిపారు.
మిగతా హీరోయిన్లకు 20 శాతం మంది ఓటు వేశారు.ఈ ఇద్దరు హీరోయిన్లు బెస్ట్ హీరోయిన్లు అయినా ఈ హీరోయిన్లలో సాయిపల్లవికి ఎడ్జ్ ఉంది.

ఒకే సినిమాలో సాయిపల్లవి, శ్రీలీల కలిసి నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.ఈ కాంబో మూవీ వేరే లెవెల్ మూవీ అవుతుందని నెటిజన్లు చెబుతున్నారు.శ్రీలీల స్కిన్ షోకు కూడా ఓకే చెబుతుండటం ఆమెకు వరమైందని కామెంట్లు వినిపిస్తున్నాయి.సాయిపల్లవి, శ్రీలీలలను అభిమానించే అభిమానుల అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. సాయిపల్లవి, శ్రీలీల( Saipallavi srileeala ) మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.







