వేడి వేడి నీటితో స్నానం చేయడం, కఠినమైన సోప్స్ ను వినియోగించడం, వాతావరణంలో వచ్చే మార్పులు, ఎండల ప్రభావం తదితర కారణాల వల్ల కొందరి ముఖ చర్మం చాలా పొడిగా తయారవుతుంది.పొడి చర్మం( Dry skin ) వల్ల ముఖంలో కళ తప్పుతుంది.
నిర్జీవంగా మారుతుంది.మరియు దురద కూడా పుడుతుంటుంది.
ఈ క్రమంలోనే చర్మాన్ని ఎలా రిపేర్ చేసుకోవాలో తెలియక తెగ బాధపడిపోతూ ఉంటారు.కానీ చింతించకండి.
ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ క్రీమ్( Natural cream ) ను కనుక వాడితే సులభంగా సమస్యను వదిలించుకోవచ్చు.మరి ఇంతకీ ఆ న్యాచురల్ క్రీమ్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఓ చూపు చూసేయండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం ( Rice )వేసి ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు రైస్ వాటర్ ను సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు ఫ్రెష్ వేపాకుతో పాటు రైస్ వాటర్ ను కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, ( Aloe Vera Gel )ఐదు టేబుల్ స్పూన్లు వేపాకు జ్యూస్, హాఫ్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్,( Olive oil ) రెండు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.దాదాపు 5 నిమిషాల పాటు కలిపితే మంచి క్రీమ్ సిద్ధమవుతుంది.ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి .ఈ క్రీమ్ ను రోజు ఉదయం స్నానం చేయడానికి గంట ముందు మరియు నైట్ నిద్రించే ముందు ముఖానికి మెడకు అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.ఇలా రోజుకు రెండు సార్లు తయారు చేసుకున్న క్రీమ్ ను వాడితే పొడి చర్మానికి బై బై చెప్పవచ్చు.ఈ క్రీమ్ మీ స్కిన్ ను మృదువుగా కోమలంగా మారుస్తుంది.
హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.అలాగే ఈ క్రీమ్ మొండి మొటిమలు, వాటి తాలూకు మచ్చలను సైతం నివారిస్తుంది.