ఒకపక్క టెక్నాలజీ పెరుగుతూ ఉంటే.మరొక పక్క సైబర్ నేరగాళ్ల మోసాలు( Scams by cybercriminals ) కూడా పెరుగుతూనే ఉన్నాయి.
సామాన్య ప్రజలకు మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు అన్ని దారులను తెరచి ఉంచారు.ఉచితలకు ఆశ పడడం, తక్కువ పెట్టుబడి తో ఎక్కువగా సంపాదించడం, లక్కీ డ్రా లాంటి వాటికి ఆశపడితే సైబర్ వలలో చిక్కినట్టే అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.
భద్రాద్రి( Bhadradri ) మండల కేంద్రంలోని దమ్మపేట గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ద్వారా మూడు నెలల క్రితం పాక్స్ కాన్ యాప్( Pax Con app ) ప్రాచుర్యంలోకి వచ్చింది.అయితే ఈ యాప్ ప్లే స్టోర్ లో అందుబాటులో లేదు.
లింక్ ద్వారా మాత్రమే ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.చైన్ సిస్టం మాదిరిగా ఈ యాప్ ఒక్కరి నుంచి మరొకరికి పంపుకున్నారు.

ఈ యాప్ లో రూ.500 నుంచి రూ.100000 వరకు పెట్టుబడులు పెట్టవచ్చు.రూ.500 పెట్టుబడి పెడితే రోజుకు రూ.12.50 చొప్పున తిరిగి వస్తాయట.ఈ యాప్ లింక్ వేరే వ్యక్తికి పంపించి అతడి నుండి పెట్టుబడి పెట్టిస్తే 10 శాతం కమిషన్ వస్తుందని యాప్ నిర్వాహకులు నమ్మించారు.
అంతే కాదు మొదట పెట్టుబడి పెట్టిన వారికి రోజు డబ్బులు తిరిగి పంపించేవారు.దీంతో కస్టమర్ల నమ్మకాన్ని సైబర్ నేరగాళ్లు సులభంగా గెలిచేశారు.

కేవలం కొద్ది రోజుల్లోనే 250 మందికి పైగా యువత.ఏకంగా రూ.2.5 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు.ఇందులో చాలామంది అప్పులు చేసి మరి పెట్టుబడులు పెట్టారు.ఇక డబ్బులు వస్తాయని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో మంగళవారం రాత్రి పాక్స్ కాన్ యాప్ ఆన్లైన్ లో పూర్తిగా క్లోజ్ అయింది.
అయితే అందరూ కూడా ఏదో టెక్నికల్ సమస్య అయి ఉంటుందని భావించారు.కానీ బుధవారం రోజు కూడా యాప్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే సాధ్యం కాకపోవడంతో తాము మోసపోయామని బాధితులు గ్రహించారు.
అయితే ఏ ఒక్క బాధితుడు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదు.







