ఎట్టకేలకు హీరో రాజశేఖర్‌ ఓ మంచి నిర్ణయం... ఇక పై సెకండ్‌ ఇన్నింగ్స్ షురూ

కాలం తో పాటు మనం ప్రయాణించాలి.కాలం తో వెళ్లకుండా నేను ఇక్కడే ఉంటాను, నా వయసు పెరగలేదు.

 Senior Hero Rajashekhar Going To Act As Supporting Role , Rajasekhar, Supporting-TeluguStop.com

నేను యుక్త వయసులో ఉన్నట్లుగానే ఉంటాను అంటే కుదరదు.ఆ విషయం తెలుసుకుని సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్స్ మసులుకుంటే మంచిది అని చాలా సందర్భాల్లో అభిమానులతో పాటు చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.

అయితే కొందరు మాత్రం తమ వయసు కు తగ్గ పాత్రలు చేయకుండా మరీ యంగ్‌ ఏజ్‌ పాత్రలు చేస్తున్నారు.ఆ విషయం లో రాజశేఖర్‌( Rajasekhar ) అతీతుడు కాదు.

ఇద్దరు బిడ్డలు పెద్ద వారు అయ్యి హీరోయిన్స్ గా నటిస్తున్నా కూడా ఇంకా కుర్ర హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తూ సినిమా లు చేయడం ఏమాత్రం బాగాలేదు అంటూ చాలా మంది విమర్శించారు.హీరోగా కాకుండా ఇతర హీరోల సినిమా ల్లో జగపతి బాబు నటించినట్లుగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా లేదా విలన్ గా నటిస్తే బాగుంటుంది కదా అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.

Telugu Telugu, Rajashekhar, Shivani, Shivathmika, Tollywood-Movie

కానీ రాజశేఖర్‌ మాత్రం నాలుగు అయిదు సంవత్సరాలుగా ఆ విషయం ను దాటవేస్తూ వస్తున్నాడు.ఎట్టకేలకు రాజశేఖర్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడు.విశ్వసనీయంగా అందుతున్న ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఒక యంగ్‌ హీరో సినిమా లో రాజశేఖర్‌ నటించబోతున్నాడట.చాలా భారీ పారితోషికంను తీసుకోవడం తో పాటు రాజశేఖర్ కి అత్యంత ప్రాముఖ్యత ఉన్న పాత్రను ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఆ సినిమా ఏంటి, ఆ హీరో ఎవరు అనేది ప్రస్తుతం హాట్‌ టాపిక్ గా ఉంది.ఒకటి రెండు వారాల్లో ఆ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటూ సమాచారం అందుతోంది.

ఈ మధ్య కాలం లో ఆ యంగ్‌ హీరో కి కూడా సక్సెస్ లు లేవు.కనుక రాజశేఖర్ తో కలిసి సినిమా లు చేస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా అని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube