ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య వెనుక భారత్ ప్రమేయం వుందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Justin Trudeau ) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.ఇప్పటికీ ఇరుదేశాల మధ్య పరిస్ధితులు ఉద్రిక్తంగానే వున్నాయి.
భారత్, కెనడా మధ్య అంతర్జాతీయ శక్తులు రాజీ కుదిర్చే పనులు కూడా మొదలెట్టాయి.ఈ సమయంలో కెనడా సంచలన నిర్ణయం తీసుకుంది.
దశాబ్ధ కాలం పాటు భారతదేశంలోని ఖలిస్తానీ మిలిటెంట్లకు ఆశ్రయం , జీవనోపాధిని అందించిన సిక్కు వ్యక్తిని దేశంలోకి అనుమతించింది.ఈ మేరకు కెనడా ఇమ్మిగ్రేషన్ ట్రిబ్యునల్ తీర్పు వెలువరించినట్లు నేషనల్ పోస్ట్ వార్తాపత్రిక నివేదించింది.
ఇమ్మిగ్రేషన్ అండ్ రెఫ్యూజీ బోర్డ్ ట్రిబ్యునల్ మెంబర్ హెడీ వోర్స్‌ఫోల్డ్( Heidi Worsfold ) మాట్లాడుతూ.భారత పౌరుడైన కమల్‌జిత్ రామ్‌ను( Kamaljit Ram ) కెనడాలోకి ప్రవేశించడానికి అనుమతించలేని వ్యక్తిగా పేర్కొనడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొన్నారు.
ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం.కమల్‌జిత్ దశాబ్ధానికి పైగా భారతదేశంలో సాయుధ ఖలిస్తానీ మిలిటెంట్లకు ఆశ్రయం, జీవనోపాధిని అందించాడు.
అయితే ప్రతీకారం తీర్చుకుంటారనే భయం, ప్రాథమిక అవసరాల నిమిత్తం అతనిని కెనడాలో ప్రవేశించడానికి అనుమతించాలని పేర్కొంది.
1982 నుంచి 1992 మధ్యకాలంలో కమల్‌జిత్ భారతదేశంలోని తన వ్యవసాయ క్షేత్రంలో సాయుధ సిక్కు మిలిటెంట్లకు( Sikh Militants ) ఆశ్రయం కల్పించడంతో పాటు ఆహారం అందించినట్లు కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ అధికారులకు అతను ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.దీంతో కెనడాలోకి( Canada ) రామ్ ప్రవేశాన్ని నిషేధించాలని ఫెడరల్ ప్రభుత్వం నిర్ణయించింది.నివేదిక ప్రకారం.
ప్రత్యేక ఖలిస్తాన్ రాష్ట్రం కోసం పోరాడిన జర్నైల్ సింగ్ భింద్రన్ వాలే అనుచరులకు తాను మద్ధతు ఇచ్చినట్లు కమల్‌జిత్ అధికారులకు చెప్పాడు.
తీర్పు సందర్భంగా వోర్స్‌ఫోర్డ్ మాట్లాడుతూ.ఆ సమయంలో ఖలిస్తాన్ మిలిటెంట్లకు రామ్ మద్ధతు ఇవ్వడంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని తెలిపారు.ఈ నేపథ్యంలోనే కమల్‌జిత్‌కు కెనడాలోకి అనుమతిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
అయితే భారత్-కెనడా మధ్య ప్రస్తుతం ప్రతిష్టంభన నెలకొన్న వేళ ఈ తీర్పు రావడం కలకలం రేపుతోంది.దీనిపై భారత్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.