ఈఎంఐ లోన్ మిస్ అయినపుడు గాబరా పడకుండా ఇలా చేస్తే సరి!

ఇదివరకు లేదుగానీ, గత కొన్ని సంవత్సరాల నుంచి అవసరానికి లోన్ ( Lone )తీసుకుని ఈఎంఐ ( EMI )(ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్) రూపంలో నెమ్మదిగా తిరిగి చెల్లించడానికి మన చుట్టూ వున్న ఎంతోమంది ఆసక్తి చూపుతున్నారు.ఈ క్రమంలో దీర్ఘకాలంలో వడ్డీ భారాన్ని మోయడానికి సిద్ధపడుతున్నారు.

 It Is Better To Do This So As Not To Panic When The Emi Loan Is Missed , Loan,-TeluguStop.com

అయితే ఈ విధానంలో ఎక్కువ కాలం పాటు క్రమం తప్పకుండా ఈఎంఐలు చెల్లించాల్సిందే అని తెలిసినా కూడా అటువైపే మొగ్గు చూపుతున్నారు.ఒకవేళ ఈఎంఐ చెల్లించలేకపోతే ఫైనాన్షియల్‌ హెల్త్‌, ముఖ్యంగా క్రెడిట్ స్కోర్‌పై ( Credit score )తీవ్రంగా ప్రభావితమవుతుందనే విషయం అందరికీ తెలిసిందే.

అయితే ఈఎంఐ డేట్ మిస్‌ అయినపుడు మాత్రం చాలామంది భయపడుతూ వుంటారు.

Telugu Monthly, Financial, Latest, Loan-Latest News - Telugu

అటువంటి పరిస్థితులలో, క్వాలిఫైడ్‌ ప్రొఫెషనల్‌ నుంచి గైడెన్స్‌ పొందడం అనేది చాలా ముఖ్యం అని గుర్తుంచుకోండి.ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ తక్కువ నష్టంతో భయటపడే మార్గాలను సూచించవచ్చు కూడా.ఈ క్రమంలో మొదట మీరు వెంటనే బ్యాంక్‌ని సంప్రదించి పేమెంట్‌ ఎందుకు చేయలేకపోయారో వివరిస్తే చాలా బావుంటుంది అని నిపుణులు చెబుతున్నారు.

చాలా మంది రుణదాతలు ప్రోయాక్టివ్ కమ్యూనికేషన్‌ను అభినందిస్తారు కూడా.పేమెంట్‌ చేయకుంటే వారు తరచుగా రిమైండర్‌లను పంపుతారు.ఆప్షన్స్‌ తెలుసుకోండి చాలా మంది రుణదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న రుణగ్రహీతలకు సహాయం చేయడానికి ఇపుడు ప్రోగ్రామ్స్‌ ను తీసుకొచ్చాయి కూడా.వీటిలో EMI రీస్ట్రక్చరింగ్‌, లోన్ రీఫైనాన్సింగ్ లేదా EMI మారటోరియం( EMI Moratorium ) అనేవి ఉంటాయి.

అందుబాటులో ఉన్న ఆప్షన్ల గురించి మీరు మొదట రుణదాతను అడిగి తెలుసుకోవడం ఉత్తమం.ఇక అన్నింటికంటే ముఖ్యంగా జరిమానాలు, పరిణామాలు ఈఎంఐ చెల్లించనప్పుడు భరించాల్సిన జరిమానాలు, పరిణామాలు గురించి లోన్‌ అగ్రిమెంట్‌లో పేర్కొంటారు.

ఈ నిబంధనలు, షరతులు తెలుసుకోవడానికి కాస్త సమయం వెచ్చించండి.ఏవైనా అదనపు రుసుముల గురించి విచారించండి.

Telugu Monthly, Financial, Latest, Loan-Latest News - Telugu

అదేవిధంగా భవిష్యత్తులో ఈఎంఐ పేమెంట్స్‌ కోల్పోకుండా చూసుకోవడానికి ఆటోమేటిక్ పేమెంట్స్‌( Automatic payments ) లేదా స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్లను సెటప్ చేసుకోండి.క్రెడిట్ రిపోర్టు ఏవైనా మిస్‌ అయిన పేమెంట్స్‌ కచ్చితంగా రిఫ్లెక్ట్‌ అవుతున్నాయని నిర్ధారించుకోవడానికి క్రెడిట్ రిపోర్టును క్రమం తప్పకుండా పర్యవేక్షించండి.ఏవైనా వ్యత్యాసాలను గుర్తిస్తే, వెంటనే సంబంధిత బ్యాంకును సంప్రదించి రిపోర్టు చేయండి.రెగ్యులేటరీ మార్గదర్శకాలు నియంత్రణ అధికారులు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏవైనా మార్గదర్శకాలు లేదా ఉపశమన చర్యల గురించి తెలుసుకోండి.

ఇలా చేస్తే మీకు ఈఎంఐ లోన్ మిస్ అయినపుడు గాబరా అనేది వుండదు.ప్రశాంతంగా ఏం చేయాలో అర్ధం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube