అంతర్జాతీయ క్రికెట్లో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు హిట్ మ్యాన్ అనే ప్రత్యేక గుర్తింపు ఉంది.రోహిత్ శర్మ క్రీజులో కాస్త ఎక్కువ సేపు నిలబడితే జట్టు విజయం సాధించినట్టే.
ప్రతి టోర్నీలో తన పేరుపై కొన్ని సరికొత్త రికార్డులు లిఖించుకోవడం రోహిత్ శర్మకు అలవాటు.

తాజాగా జరిగిన భారత్- ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ( Rohit Sharma ) సెంచరీ తో అద్భుత ఆటను ప్రదర్శించిన సంగతి తెలిసిందే.ఈ మ్యాచ్ లో ఓ అరుదైన ఘనతను సాధించాడు.భారత ఇన్నింగ్స్ ఎనిమిదవ ఓవర్లో నవీన్ ఉల్ హక్ బౌలింగ్ లో ఐదో బంతికి సిక్స్ కొట్టి, ఓ సరికొత్త చరిత్రను సృష్టించాడు.

అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ శర్మ 453 మ్యాచ్లు ఆడి 556 సిక్సులు బాదాడు.నిన్నటిదాకా ఈ రికార్డ్ వెస్టిండీస్ మాజీ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉండేది. క్రిస్ గేల్ ( Chris Gayle )అంతర్జాతీయ క్రికెట్లో 553 సిక్సర్లు కొట్టాడు.మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ స్పందిస్తూ.మీరు ఎవరి రికార్డును బద్దలు కొట్టారు అని రిపోర్టర్ ప్రశ్నించగా.తన మంచి ఓల్డ్ ఫ్రెండ్ క్రిస్ గేల్ సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టానని తెలిపాడు.
క్రిస్ గేల్ ఎప్పటికీ యూనివర్స్ బాసే.క్రిస్ గేల్ సిక్సర్లు కొట్టే మిషన్ అని చెప్పుకొచ్చాడు.
తాను, క్రిస్ గేల్ ఒకే నెంబర్ ఉండే జెర్సీ(45)ని ధరిస్తామని, తాను క్రిస్ గేల్ రికార్డు బద్దలు కొట్టడం వల్ల క్రిస్ గేల్ కూడా సంతోషంగానే ఉంటాడని తాను అనుకుంటున్నట్లు రోహిత్ శర్మ తెలిపాడు.తాజాగా జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ ( Afghanistan )పై రోహిత్ శర్మ ఏకంగా 5 సిక్సర్లు కొట్టాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు 272 పరుగులు చేసింది.
భారత్ 35 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది.







