వరల్డ్ కప్ టోర్నీలో వరుస విజయాలతో భారత్ దూసుకుపోతుంది.మొదటి మ్యాచ్ ఆస్ట్రేలియా( Australia ) పై గెలవగా నేడు ఆఫ్గానిస్థాన్ తో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది.
ఢిల్లీలో జరిగిన ఈ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఇండియా గెలిచింది.ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 272 పరుగులు చేయడం జరిగింది.దీంతో 273 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.35 ఓవర్లలో లక్ష్యాన్ని చేదించింది.భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ( Captain Rohit Sharma ) (131) పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటం జరిగింది.ఇషాన్(47), అయ్యర్(25*), కోహ్లీ(55*) పరుగులు చేయడం జరిగింది.
రోహిత్ శర్మ మొదటి నుండి దూకుడుగా ఆడటంతో… స్కోరుబోర్డు( Scoreboard ) మొదటి నుండి వేగంగా పరుగులు పెట్టింది.ఓపినర్ మరో బ్యాట్స్ మెన్ ఇషాన్ కిషన్ జోడి తొలి వికెట్ 150 కి పైగా పరుగులు చేసి అద్భుతమైన ఆరంభాన్ని అందించడం జరిగింది.
ఆఫ్గాన్ బౌలర్లలో రషీద్ రెండు వికెట్లు తీయడం జరిగింది.ఇదిలా ఉంటే అక్టోబర్ 14 వ తారీకు అహ్మదాబాద్ వేదికగా భారత్ మరియు పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి.
ఈ హై వోల్టేజ్ మ్యాచ్ చూడటానికి చాలామంది సెలబ్రిటీలు ఇంకా ఇతర దేశాలకు చెందినవాళ్లు వస్తూ ఉన్నారు.ఈ క్రమంలో 60 మంది పాకిస్తాన్ జర్నలిస్టులకు మ్యాచ్ తిలకించటానికి భారత ప్రభుత్వం వీసాలు జారీ చేయడం జరిగింది.







