తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకొని రాసలీలలు చేస్తున్న సమయంలో హఠాత్తుగా ఆమె చిన్నారి చెల్లెలు వీరి అసభ్యకర దృశ్యాలను చూశారు.దీంతో తన ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు చెబుతుందేమో అని భయపడిన ఆ యువతి సొంత చెల్లెలు అనే కనికరం లేకుండా ఇద్దరినీ చంపేసింది.
ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ ( Uttar Pradesh )లోని బల్రాయ్ పోలీస్ స్టేషన్ ( Balrai Police Station )పరిధిలో చోటు చేసుకుంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.బహాదూర్పుర్ గ్రామంలో అంజలి అనే 20 ఏళ్ల యువతి అదే ప్రాంతానికి చెందిన ఒక యువకుడితో ప్రేమలో పడింది.
ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఆ యువకుడిని ఇంటికి పిలిపించుకొని అతనితో సన్నిహితంగా మెలిగింది.అయితే అనుకోకుండా హఠాత్తుగా ఆమె చిన్నారి చెల్లెలు వీరు అసభ్యకర స్థితిలో ఉండడం చూశారు.

దీంతో అంజలి( Anjali ) తీవ్ర ఆందోళనకు గురైంది.తన ప్రేమ వ్యవహారం కచ్చితంగా తల్లిదండ్రులకు తెలిసిపోతుందని చాలా కంగారు పడింది.ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులలో ఇక చెల్లెలు చంపేయడమే దీనికి పరిష్కారం అని చెల్లెలను చంపేందుకు సిద్ధమైంది.ఇంట్లో ఉండే ఓ పదునైన ఆయుధంతో ఇద్దరు చెల్లెలను చంపేసింది.
తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తర్వాత ఎవరో చెల్లెళ్లను చంపేశారు అంటూ కట్టు కథ చెప్పి వారిని నమ్మించే ప్రయత్నం చేసింది.స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్నాం పోలీసులు చిన్నారుల మృతదేహాలను పరిశీలించారు.
అయితే అంజలి దుస్తులకు రక్తపు మరకలు ఉండడం గమనించిన పోలీసులు తమదైన శైలిలో గట్టిగా అంజలిని నిలదీశారు.దీంతో భయపడి అంజలి జరిగిన విషయం పోలీసులకు వివరించింది.అయితే ఈ హత్యలు చేయడానికి అంజలికి మరికొందరు కూడా సహకరించారని పోలీసులు అనుమానిస్తున్నారు.6,4 సంవత్సరాల వయస్సు ఉన్న ఇద్దరు చిన్నారులు హత్యకు గురవ్వడం, ఆ హత్యలు చేసిందే తమ పెద్ద కుమార్తె కావడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.పోలీసులు అంజలిని అరెస్టు చేసి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.







