కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు సిద్దార్థ్ ( Siddharth ) ఒకరు.ఈయన తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
తెలుగులో కూడా బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, చుక్కల్లో చంద్రుడు వంటి సినిమాల ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సిద్దార్థ్ కి అనంతరం తెలుగులో నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి.ఇక తమిళ భాషలో కూడా అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడంతో ఈయన అడపా దడపా సినిమా అవకాశాలను అందుకుంటు నటిస్తున్నారు.

తాజాగా చిన్నా అనే సినిమా( Chinna Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా తమిళంలో ఎంతో మంచి సక్సెస్ అందుకోవడంతో ఇతర భాషలలో కూడా విడుదల చేశారు.ఇతర భాషలలో కూడా ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుని మంచిగా కలెక్షన్స్ రాబడుతోంది.ఇకపోతే సిద్దార్థ్ గురించి గతంలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయిన విషయం మనకు తెలిసిందే.
ఈయన నటి సమంతాను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని భావించారు.అయితే కొన్ని కారణాల వల్ల వీరీ పెళ్లి ఆగిపోయింది.
అప్పట్లో వీరిద్దరి గురించి ఎన్నో రకాల వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇక సిద్దార్థ్ సమంతను పెళ్లి చేసుకుంటానని చెప్పి తనని మోసం చేశారు.తాజాగా కోలీవుడ్ ఇండస్ట్రీ( Kollywood Industry )లో ప్రముఖ ఫిలిం జర్నలిస్టు మాట్లాడుతూ సిద్దార్థ్, సమంత( Samantha ) గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు సమంత మోసం చేయటం వల్లే ఆయన కెరియర్ ఇలా దెబ్బతిందని ఆమె ఉసురు తనకు తగిలింది అంటూ ఆయన కామెంట్ చేయడం గమనార్హం.ఇలా సమంత ఉసురు ఆ హీరోకి తగలడం వల్లే అవకాశాలు లేకుండా ఇండస్ట్రీలో ఎంతో ఇబ్బంది పడుతున్నారు అంటూ ఈయన కామెంట్ చేశారు.
అయితే సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్న సమయంలో పరోక్షంగా సిద్దార్థ్ సమంత పట్ల కామెంట్స్ చేసిన సంగతి కూడా మనకు తెలిసిందే అప్పట్లో ఈ విషయం కూడా వివాదంగానే మారింది.







