తెలంగాణలో బీజేపీ సింగిల్ గానే పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత, ఎంపీ బండి సంజయ్ అన్నారు.రాష్ట్రంలో జనసేనతో పొత్తుపై పార్టీ హైకమాండ్ దే తుది నిర్ణయమని పేర్కొన్నారు.
ప్రతి సర్వే బీజేపీకే అనుకూలంగా ఉందని బండి సంజయ్ తెలిపారు.రాష్ట్ర ప్రజలు బీజేపీకి సంపూర్ణ మద్ధతు తెలుపుతున్నారన్న ఆయన రానున్న ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఎక్కడి నుంచి నిధులు తేస్తారో స్పష్టత లేదన్న విషయం ప్రజలకు తెలుసన్నారు.తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే ఇక్కడా రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.
కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులమయంగా చేశారన్న ఆయన అప్పులను ఏ విధంగా తీరుస్తారో చెప్పాలన్నారు.రాష్ట్రంలో కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడటానికి కారణం ఏంటని ప్రశ్నించారు.
ఈ క్రమంలో తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందన్న బండి సంజయ్ తమ గ్రాఫ్ తగ్గినట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.