కోనసీమ జిల్లాలోని అమలాపురంలో స్టూడెంట్స్ మధ్య గ్యాంగ్ వార్ తీవ్ర కలకలం సృష్టించింది.
కాలేజీలో ఏర్పాటు చేసిన ఫేర్ వెల్ పార్టీలో సాంగ్ విషయంలో విద్యార్థుల మధ్య వివాదం చెలరేగిందని తెలుస్తోంది.
అదికాస్తా ముదరడంతో రెండు వర్గాలుగా విడిపోయిన విద్యార్థులు రోడ్డుపై పరస్పర దాడులకు పాల్పడ్డారని సమాచారం.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
అనంతరం పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.







