Jacky Bhagnani : నువ్వే నా ధైర్యం, నీతో ప్రయాణం అద్భుతం.. రకుల్ పై ప్రియుడి ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే!

సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి రకుల్ ప్రీతిసింగ్( Rakul Preeth Singh ) అనంతరం తమిళ భాష చిత్రాలలో కూడా నటించే అవకాశాలను అందుకున్నారు.ఇలా నటిగా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమెకు ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ( Bollywood industry ) వైపు అడుగులు వేశారు.

 Rakul Preeth Singh Praises Boy Friend Jacky Bhagnani-TeluguStop.com

ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె దాదాపు పది సినిమాలకు పైగా అవకాశాలను అందుకొని గత మూడు సంవత్సరాల నుంచి క్షణం పాటు తీరకలేకుండా బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా తన 33వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.

ఇక ఈమె సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరోవైపు నిర్మాత నటుడు జాకీభగ్నాని ( Jacky Bhagnani) ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే.వీరి ప్రేమ గురించి ఈమె అధికారికంగా ప్రకటించారు.ఇలా తనకు సమయం దొరికినప్పుడల్లా ప్రియుడుతో కలిసి తన విలువైన సమయాన్ని గడుపుతో ఎంజాయ్ చేశారు.ఇకపోతే రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు కావడంతో ఈమె ప్రియుడు జాకీ సోషల్ మీడియా వేదికగా రకుల్ ప్రీత్ సింగ్ తోగడిపినటువంటి అద్భుతమైన క్షణాలన్నింటిని ఒక వీడియో రూపంలో చిత్రీకరించి పోస్ట్ చేశారు.

అలాగే తన ప్రియురాలు నటి రకుల్ గురించి ఈయన ఎంతో గొప్పగా వర్ణిస్తూ ఆమెకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా జాకీ ( Jacky Bhagnani)స్పందిస్తూ… నీకు ఎంతో ప్రత్యేకమైన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నన్ను నిత్యం సర్ప్రైజ్ చేసే వ్యక్తి గురించి నా అభిమానాన్ని తెలియజేయాలనుకుంటున్నాను.నీతో ఉంటే నాకు ఎప్పుడూ ఒక అద్భుతమైన ప్రయాణం అనే ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడు కూడా అలసిపోయినట్టు అనిపించదు.నువ్వే నా ధైర్యం నువ్వు ప్రతి అడుగులోనూ నువ్వే నా లైఫ్ పార్ట్నర్.

నా జీవితాన్ని ప్రేమతో సంతోషంతో నింపే వ్యక్తి నువ్వే.ఈ గొప్ప రోజున నువ్వు కన్న కళలన్నీ నిజం కావాలని కోరుకుంటున్నాను.

అవన్నీ కూడా నిజమవుతాయి ఎందుకంటే వాటిని పొందడానికి నువ్వే ఉత్తమమైన అర్హురాలివి.ప్రతి రోజును అద్భుతంగా మార్చే వ్యక్తికి బర్త్ డే విషెస్ అంటూ ఈయన రకుల్ గురించి ఎంతో గొప్పగా చెబుతూ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

అయితే ఈ పోస్ట్ పై స్పందించినటువంటి రకుల్ థాంక్యూ మై డియర్ లవ్ అంటూ రిప్లై ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube