మాస్ మహారాజా రవితేజ( Ravi Teja ) హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao ) దసరా పండుగ కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.రికార్డ్ స్థాయి వసూళ్లు నమోదు చేసే విధంగా ఈ సినిమా ఉంటుందని… పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా సత్తా చాటగలదు అన్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్ సందర్భంగా కామెంట్స్ చేస్తున్నారు.
మరీ ఇంత నమ్మకమా అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రవితేజ( Ravi Teja ) గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.కనుక ఈ సినిమా విషయం లో ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు.అయితే సినిమా పబ్లిసిటీ మొదలు అయినప్పటి నుంచి కూడా కొందరు ఈ సినిమా పై ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు.
టైగర్ నాగేశ్వరరావు పాత్ర లో రవితేజ లుక్ బాగానే ఉంది.అయితే రవితేజ ను వింటేజ్ లుక్ లో అది కూడా ఒక గజ దొంగ లుక్ లో చూడటం ఇబ్బందిగా ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
రవితేజ వయసు పెరిగి వింటేజ్ లుక్ లో కనిపిస్తే ఎబ్బెట్టుగా ఉన్నాడు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.ట్రైలర్ మరియు టీజర్ లోనే రవితేజ ను అలా చూడలేక పోతున్నాం.
వెండి తెరపై రవితేజ( Ravi Teja ) లుక్ ను చూడలేస్తామా అంటూ కొందరు యాంటీ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.ఆ ట్రోల్స్ కి మాస్ మహా రాజా రవితేజ ఫ్యాన్స్ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు.రవితేజ గురించి మాట్లాడే వారికి ఆయన సినిమా వసూళ్లు సమాధానంగా నిలువబోతున్నాయి అంటూ హెచ్చరిస్తున్నారు.రేణు దేశాయ్( Renu Desai ) ఈ సినిమా లో కీలక పాత్ర లో కనిపించబోతున్న విషయం తెల్సిందే.
అందుకే టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao ) సినిమా చాలా స్పెషల్ సినిమా అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.