ఇండియన్ 2 సినిమాపై మేకర్స్ సాలిడ్ అప్డేట్.. ఫ్యాన్స్ ఖుషీ!

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్( Kamal Haasan ) ఎన్నో ఏళ్ల తర్వాత ఫామ్ లోకి రావడంతో అదే ఊపులో వరుస సినిమాలు చేస్తూ ఆయన ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తున్నాడు.గత కొన్నేళ్లుగా హిట్ ముఖమే చూడని కమల్ కు ఎన్నో ఏళ్ల తర్వాత ‘విక్రమ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ లభించింది.

 Kamal Haasan Indian 2 Interesting Update, Kamal Haasan,indian 2, Kajal Aggarwal,-TeluguStop.com

దీంతో ఈయన ఎప్పుడో ఆగిపోయిన ‘ఇండియన్ 2′( Indian 2 ) సినిమాను మళ్ళీ సెట్స్ మీదకు తీసుకు వచ్చాడు.

Telugu Indian, Kajal Aggarwal, Kamal Haasan, Shankar-Movie

రెండేళ్ల క్రితమే విక్రమ్ సినిమా కంటే ముందే ఎంతో గ్రాండ్ గా స్టార్ట్ అయిన ఈ మూవీ అనేక కారణాల వల్ల వాయిదా పడింది.ఈ సినిమా ఇక తెరకెక్కే అవకాశమే లేదు అని ప్రేక్షకులు భావిస్తున్న నేపథ్యంలో మళ్ళీ సెట్స్ మీదకు తీసుకు వచ్చి సినిమా శరవేగంగా పూర్తి చేస్తున్నారు.భారతీయుడు సినిమాకు సీక్వెల్( Bharateeyudu Sequel ) గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది.

శంకర్, కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కిన భారతీయుడు ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అందుకే ఈ సినిమా సీక్వెల్ కోసం అంతే ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

తాజాగా ఈ సినిమాపై మేకర్స్ సాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.గత కొద్దీ నెలలుగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా ఫైనల్ స్టేజ్ కు చేరుకున్నట్టు తెలుస్తుంది.

Telugu Indian, Kajal Aggarwal, Kamal Haasan, Shankar-Movie

చిత్ర నిర్మాణ సంస్థ ఈ సినిమాపై తాజాగా అప్డేట్ ఇచ్చారు.కమల్ హాసన్ తన డబ్బింగ్ వర్క్ స్టార్ట్( Kamal Haasan Dubbing Works ) చేసినట్టు ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశారు.దీంతో ఈ సినిమా ఆల్మోస్ట్ ఫైనల్ కు చేరుకున్నట్టే అని చెప్పాలి.మరి షూట్ పూర్తి అయిపోతే రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇక ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ ఫిలిమ్స్ సంయుక్తంగా వందల కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తుండగా.అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube