బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో( Bigg Boss Show ) ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న వాళ్లలో పల్లవి ప్రశాంత్ ఒకరు.మొదట్లో రతిక వల్ల గేమ్ విషయంలో తప్పటడుగులు వేసిన పల్లవి ప్రశాంత్ ఆ తర్వాత తన తప్పులు తెలుసుకుని జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.పల్లవి ప్రశాంత్ కు శివాజీ సపోర్ట్ ఉండటం ప్లస్ అవుతోంది.టాప్5 లో పల్లవి ప్రశాంత్ ఉండటం ఖాయమని నెటిజన్లు ఫిక్స్ అయ్యారు.

అయితే పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) 13 సంవత్సరాల వయస్సులోనే వ్యవసాయ పనులను మొదలుపెట్టాడట.పల్లవి ప్రశాంత్ కు కారు ఉన్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని కారు లేకపోయినా ట్రాక్టర్ అయితే ఉందని వ్యవసాయ పనుల కోసం ఆ ట్రాక్టర్ ను ఉపయోగిస్తారని తెలుస్తోంది.బిగ్ బాస్ హౌస్ లో శివాజీ( Shivaji ) తన కొడుకు పల్లవి ప్రశాంత్ ను కాపాడుకుంటూ వస్తున్నాడని పల్లవి ప్రశాంత్ తల్లీదండ్రులు చెబుతున్నారు.
వారానికి లక్ష రూపాయల పారితోషికం తీసుకుంటున్న పల్లవి ప్రశాంత్ గురించి కొత్తగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు( Wild Card Contestants ) సైతం పాజిటివ్ గా స్పందిస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.
పల్లవి ప్రశాంత్ తన క్రేజ్ తో బిగ్ బాస్ షో తర్వాత కెరీర్ పరంగా మరింత బిజీ అవుతారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.పల్లవి ప్రశాంత్ కెరీర్ ప్లానింగ్ కూడా మామూలుగా లేదు.

బిగ్ బాస్ షో ద్వారా ఫేమ్ తెచ్చుకోవాలని భావించిన పల్లవి ప్రశాంత్ ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు.ఇతర కంటెస్టెంట్లు సైతం పల్లవి ప్రశాంత్ తమకు గట్టి పోటీ ఇస్తున్నాడని భావిస్తున్నారు.పల్లవి ప్రశాంత్ ఎవరినీ బాధ పెట్టడని అతని మనస్సు మంచి మనస్సు అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.







