సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు మంచి విజయాలను అందుకుని ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నప్పటికీ ఆ తర్వాత కాలంలో వాళ్ళు చేసిన సినిమాలు పెద్ద గా ఆడకపోవడం తో ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయిపోతూ ఉంటారు.ప్రస్తుతం కొంతమంది హీరోలు అదే పనిలో ఉన్నారు ఇక మంచు మనోజ్ అయితే సినిమాలు చేస్తాడా, లేదంటే పాలిటిక్స్ వైపు వెళ్తాడు అనేది ఆయన విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.
ఎందుకంటే ఆయన పెళ్లి చేసుకున్న భూమా ఫ్యామిలీ( Bhuma family ) పాలిటిక్స్ తో మంచి అనుబంధ ఉన్న ఫ్యామిలీ కావడంతో ప్రస్తుతం ఆయన పాలిటిక్స్ లోకి వెళ్తున్నాడు అనే విషయం మీద కూడా చాలా ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి.ఈయన కెరియర్ పాలిటిక్స్ వైపు నడుస్తుంది అని అందరూ అనుకుంటున్నారు కానీ ఇలాంటి సమయంలో మళ్లీ ఈయన కొన్ని సినిమాలకు సైన్ చేసి హీరోగా ఎక్కువగా చేయడానికి మళ్ళీ ఆసక్తిని చూపిస్తున్నాడు.
మరి ఇలాంటి టైం లో ఆయనకి పాలిటిక్స్ బెటరా సినిమా పెట్టరా అనేది ఆయన నిర్ణయించుకోవాలి ఎందుకంటే సినిమాల పరంగా చూసుకుంటే ఆయన కెరియర్ అనేది ఆల్మోస్ట్ క్లోజ్ లో ఉంది.

ఆయన సినిమా చేయక దాదా 6, 7 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఆయన మార్కెట్ పరంగా చూసుకున్న సినిమాల పరంగా చూసుకున్న ఆయనకి అంత మంచి అవకాశాలు అయితే లేవు కాబట్టి అలాంటి సమయంలో ఆయన పాలిటిక్స్ వైపు వెళితే ఆయనకి సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని సినీ మేధావులు సైతం చెప్పడం జరుగుతుంది.ఈయన చేసిన సినిమాల్లో వేదం, బిందాస్ ( Vedam , Bindas )సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.ఇక ప్రస్తుతం ఆయన రూట్ ఎటువైపు సాగుతుందో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాలి…
.







