కాంగ్రెస్, బీజేపీలపై బీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్, బీజేపీ నేతలు వస్తారని విమర్శించారు.
కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం ఎప్పుడు ప్రజల మధ్యనే ఉంటారని మంత్రి గంగుల తెలిపారు.కొందరు ఓట్ల కోసం డబ్బులు పట్టుకొని వస్తారన్న ఆయన కాంగ్రెస్, బీజేపీ నేతల మాటలు ప్రజలు నమ్మొద్దని సూచించారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన బీఆర్ఎస్ ప్రభుత్వమే మరోసారి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.అదేవిధంగా తాను గెలిచినా ఓడినా ప్రజల మధ్యనే ఉంటానని స్పష్టం చేశారు.