ఏపీలోని వైసీపీ నేతలతో సీఎం జగన్ భేటీ కానున్నారు.ఈ మేరకు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో వైసీపీ ప్రతినిధులు సభ జరగనుంది.
ఈ క్రమంలో రేపటి సభకు ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను సజ్జల రామకృష్ణారెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమావేశానికి సుమారు ఎనిమిది వేల మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.
ఎన్నికల నేపథ్యంలో రేపటి సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడిందని సజ్జల స్పష్టం చేశారు.







