భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి( Mahatma Gandhi Jayanti ) సందర్భంగా సింగపూర్‌లోని ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ ఆరుగురు భారత సంతతి విద్యార్ధులకు శనివారం స్కాలర్‌షిప్‌లు అందజేసింది.ఈ ఆరుగురు సంగీతం, నృత్యంలలో అసాధారణ ప్రతిభ కనబరిచినట్లు నిర్వాహకులు తెలిపారు.
సింగపూర్‌లోని భారత హైకమీషనర్ డాక్టర్ శిల్పక్ అంబులే ( Dr.Shilpak Ambule )చేతుల మీదుగా విద్యార్ధులకు అవార్డులను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.మహాత్మా గాంధీ జీవిత ప్రయాణం , స్వాతంత్య్ర పోరాటాన్ని గుర్తుచేసుకున్నారు.గాంధీజీ జీవితం సరళత, వినయంతో నిండి వుందన్నారు.

మహాత్మాగాంధీ కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదని.అహింస, సహనం, అందరికీ ప్రేమను పంచాలని సందేశం ఇచ్చారని అంబులే గుర్తుచేశారు.ఆయన లక్షలాది మందికి స్పూర్తినిచ్చిన ఆధ్యాత్మిక మార్గదర్శి అని అంబులే కొనియాడారు.
ఇక సీఐఎఫ్‌ఏఎస్ గురించి ఆయన మాట్లాడుతూ.ఈ సంస్థ సాంస్కృతిక రంగంలో సింగపూర్‌లోని( Singapore ) భారతీయ ప్రతిభకు అవకాశాలను సృష్టించిందన్నారు.
ముంబైకి చెందిన 58 ఏళ్ల వయోలిన్ విద్వాంసుడు, బ్యాంకర్ స్వామినాథన్ మాట్లాడుతూ.సిఫాస్ వంటి సంస్థల ద్వారా సింగపూర్‌లో సాంప్రదాయ నృత్యాల వంటి కార్యక్రమాలకు భారతీయ విద్యార్ధులు ఎక్కువగా హాజరవుతున్నారని కొనియాడారు.

స్కాలర్‌షిప్ అందుకున్న భారత సంతతి విద్యార్ధి సుధీర్విన్ ( Sudhirvin )మాట్లాడుతూ.భారతదేశానికి చెందిన టీచర్లు, శిక్షకుల ఆధ్వర్యంలో కీబోర్డ్ ఆధారంగా సంగీతాన్ని అందించే స్థాయిని మరింత పెంచడానికి ఈ స్కాలర్‌షిప్ సహాయపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.భారతీయ సంస్కృతిని ప్రోత్సహించే లక్ష్యంలో సిఫాస్‌కి ఇలాంటి కార్యక్రమాలు మరింత దోహదం చేస్తాయని చెప్పారు.తల్లిదండ్రులుగా .తాము స్వదేశంలో బలమైన సాంస్కృతిక, సాంప్రదాయ సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నామని బ్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్ స్వామినాథన్ అన్నారు.స్కాలర్‌షిప్‌ల ప్రదానోత్సవం కార్యక్రమానికి సింగపూర్‌లోని భారతీయ సమాజం, కళాకారులు, సంగీత విద్వాంసులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.