తక్కువ ధరలో బెస్ట్ పవర్ బ్యాంక్స్( Power Banks ) కొనుగోలు చేయాలనుకుంటున్నారా.అయితే ఈ పవర్ బ్యాంక్స్ లకు సంబంధించిన వివరాలు చూసి కొనుగోలు చేసేయండి.
Amazon Basics:
ఈ పవర్ బ్యాంక్ 10000 mAh బ్యాటరీ కెపాసిటీతో ఉంటుంది.ఈ పవర్ బ్యాంక్ అసలు ధర రూ.1999 గా ఉంది.అయితే ఆఫర్ లో భాగంగా రూ.649 కే సొంతం చేసుకోవచ్చు.ఇందులో ఉండే బ్యాటరీ లిథియం పాలిమర్ తో తయారయింది.
మైక్రో USB లేదా టైప్ సీ ద్వారా చార్జింగ్ చేసుకోవచ్చు.ఆటో షట్ ఆఫ్, ఎల్ఈడీ ఇండికేటర్ లైట్స్, థర్మల్ ప్రొటెక్షన్ ఐసీ ఇలాంటి ఫీచర్లు ఈ పవర్ బ్యాంకు లో ఉన్నాయి.
URBN:
ఈ పవర్ బ్యాంక్ 10000 mAh బ్యాటరీ సామర్థ్యం, పాలిమర్ అల్ట్ర కాంపాక్ట్( Polymer Ultra Compact ) పవర్ బ్యాంక్.ఇందులో USB, మైక్రో USB ఛార్జింగ్ ఆప్షన్లతో ఉంటుంది.3000mAh ఫోన్ బ్యాటరీని 2.4 సార్లు చార్జింగ్ చేసుకోవచ్చు.డ్యుయల్ యూఎస్బీ అవుట్ ఫుట్ 2.4 AMP 5V ఫాస్ట్ చార్జింగ్ తో దీనిని రూపొందించారు.

MI 10000mAh Li- Polymer:
ఈ పవర్ బ్యాంకు ను USB, టైప్ సీ పోర్ట్ తో రూపొందించారు.18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ ఈ పవర్ బ్యాంక్ సొంతం.ఈ పవర్ బ్యాంకు ధర రూ.1149 గా ఉంది.

Belkin:
ఈ పవర్ బ్యాంక్ 10000 mAh PD 3.0 Slim Fast charging పవర్ బ్యాంక్.దీని ధర రూ.3499 గా ఉంది.అయితే అమెజాన్లో డిస్కౌంట్ లో భాగంగా రూ.1699 గా ఉంది.ఒకసారి చార్జింగ్ చేస్తే 40 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.ఈ పవర్ బ్యాంకు పై కంపెనీ రెండేళ్ల వారంటీ అందించింది.







