తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు ప్రభాకర్( Actor Prabhakar ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో సీరియల్స్ లో నటించి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు ప్రభాకర్.
ఇప్పటికీ వరుసగా సీరియల్స్ లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.ఈటీవీ,మాటీవీ, జీ తెలుగు ఇలా అన్నీ చానల్స్ లో సీరియల్స్ లో నటిస్తున్నారు ప్రభాకర్.
బ్లాక్ అండ్ వైట్ డేస్ నుంచి డిడిలో ప్రసారమైన ఋతురాగాల ( Ruthuragalu ) టైం నుంచి ప్రభాకర్ అందరికీ చిరపరిచితుడే.అలాంటి ప్రభాకర్ తన లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి ఆదివారం స్టార్ మా ఛానల్ లో ప్రసారం కానున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో( Adivaram With Star Maa Parivaram ) తెలిపారు.

తెలిసీ తెలియక చాలా బాధ పెట్టిన సందర్భం ఒకటి ఉంది అంటూ ఆ సంఘటన గురించి చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ.నాకు ఒక గర్ల్ ఫ్రెండ్( Girl Friend ) ఉండేది.ఆ విషయంలో నా భార్య చాలా బాధ పడింది.
ఆ సందర్భాన్ని ఎలాగో నేను సరి చేసుకుని మనస్ఫూర్తిగా సారీ చెప్పాను.నేను సారీ చెప్పడం పెద్ద గొప్ప గుణం కాదు.
తను క్షమించడం గొప్ప విషయం అంటూ తన భార్య మలయజ( Malayaja ) గురించి గొప్పగా చెప్తూనే బుగ్గపై షోలోనే ఒక ముద్దిచ్చారు.ఈ ఆదివారం షోలో కొంత మంది జంటల్ని ఇన్వైట్ చేసింది శ్రీముఖి వాళ్ళల్లో ప్రభాకర్, మలయజ ఒక పెయిర్.

అయితే వాళ్ళ పెళ్లి ఫొటోస్ ని వెనక స్క్రోలింగ్ లో వేస్తూ ఉండగా ప్రభాకర్ పెళ్లి ఫోటో చూసి అసలు విషయం చెప్పాడు.మా పెళ్లి ఆర్య సమాజ్ లో జరిగింది.అయితే అక్కడ మాకు సంబందించిన వాళ్ళెవరూ లేరు.దొంగ పెళ్లి స్నేహితులు, తెలిసిన వాళ్ళ సమక్షంలో పెళ్లి చేసుకున్నట్లు చేసుకున్నాము అని తెలిపారు ప్రభాకర్.ఖమ్మం నుంచి వచ్చిన తన ఫ్రెండ్ కన్యాదానం చేశారని వివరించారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.







